Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న టిప్పర్.. ముగ్గురు మృతి
Nellore - Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఏపీలోని
Nellore – Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు వద్ద మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. తాళ్లాయిపాడు వద్ద మొదట టిప్పర్ లారీ.. ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటో వెళ్లి మరో కారును ఢికొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
అయితే.. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఎనిమిది మంది వరకు కూలీలు ఉన్నారు. వారంతా పనుల కోసం వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: