Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Smuggling: శానిటరీ న్యాప్కిన్స్‌లో దాచి బంగారం రవాణా.. తనిఖీల్లో దొరికిపోయిన ఎయిర్‌ హోస్టెస్‌

విదేశాల నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చేందుకు  వినూత్న పద్ధతులు అవలంభిస్తున్నారు కొందరు మోసగాళ్లు..

Gold Smuggling: శానిటరీ న్యాప్కిన్స్‌లో దాచి బంగారం రవాణా..  తనిఖీల్లో దొరికిపోయిన ఎయిర్‌ హోస్టెస్‌
Follow us
Basha Shek

|

Updated on: Nov 10, 2021 | 10:10 PM

విదేశాల నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చేందుకు  వినూత్న పద్ధతులు అవలంభిస్తున్నారు కొందరు మోసగాళ్లు. తాజాగా ఎయిర్‌ ఇండియా విమానంలో పనిచేస్తున్న ఓ మహిళ శానిటరీ ప్యాడ్స్‌లో బంగారాన్ని దాచి అక్రమ రవాణాకు ప్రయత్నించింది. అయితే అనుమానమొచ్చిన మహిళా సిబ్బంది తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది. మహిళ నుంచి సుమారు 2.4 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేరళ కోజికోడ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ), ఎయిర్ కస్టమ్స్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టారు.

షార్జా నుంచి వచ్చే ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో బంగారం అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న అధికారులు విమానం కోజికోడ్‌లో ల్యాండ్‌ అవ్వగానే తనిఖీలు ప్రారంభించారు. ఈక్రమంలోనే ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగం చేస్తున్న షహానా అనే మహిళ తన శానిటరీ ప్యాడ్స్‌లో బంగారం దాచి తీసుకువచ్చిందని మహిళా అధికారులు గుర్తించారు. నిందితురాలిది కేరళలోని మలప్పురం ప్రాంతమని అధికారులు తెలిపారు.

Also Read:

SCCL: సింగరేణి ఘటనలో న‌లుగురి మృతదేహాలు లభ్యం.. సంతాపం తెలిపిన మంత్రులు.. కార్మికులకు అండగా ఉంటామన్న సీఎండీ

Lakshman Naik IPS: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి లక్ష్మణ్‌ నాయక్‌పై వేటు.. సస్పెండ్‌ చేసిన కేరళ ప్రభుత్వం.. కారణం అదేనా..?

Accident: బట్టల షాపులోకి దూసుకెళ్లిన బైక్.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు.. అసలు ఏం జరిగిందంటే..