Road Accident: టీ తాగుతుండగా.. ట్రక్కు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. ఆరుగురు దుర్మరణం..

Ghazipur Road Accident: రోడ్డు పక్కనున్న హోటల్ దగ్గర ఉదయాన్నే టీ తాగుతున్నారు. ఈ క్రమంలో మృత్యువు ట్రక్కు రూపంలో దూసుకొచ్చింది. వేగంగా వస్తున్న ట్రక్కు రోడ్డు పక్కనున్న

Road Accident: టీ తాగుతుండగా.. ట్రక్కు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. ఆరుగురు దుర్మరణం..
Road Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 02, 2021 | 3:38 PM

Ghazipur Road Accident: రోడ్డు పక్కనున్న హోటల్ దగ్గర ఉదయాన్నే టీ తాగుతున్నారు. ఈ క్రమంలో మృత్యువు ట్రక్కు రూపంలో దూసుకొచ్చింది. వేగంగా వస్తున్న ట్రక్కు రోడ్డు పక్కనున్న హోటల్‌లోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మత్యువాతపడ్డారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం.. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ జిల్లాలో జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు మహ్మదాబాద్‌ కొత్వాలీ పరిధిలోని అహిరోలి గ్రామంలోని టీ స్టాల్‌లోకి దూసుకెళ్లడంతో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందగా.. పలువురు గాయపడినట్లు మహ్మదాబాద్‌ పోలీసులు తెలిపారు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్థులు డ్రైవర్‌ను పట్టుకొని చితకబాదారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు ఎస్పీ ఆర్‌బీ సింగ్‌ తెలిపారు. డ్రైవర్‌ను రక్షించేందుకు పోలీసులు బాగా శ్రమించాల్సి వచ్చింది. అహిరోలి శివారులోని ఓ టీస్టాల్‌ వద్ద జనం కూర్చొని ఉండగా.. భరౌలీ వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు టీ స్టాల్‌లోకి చొచ్చుకెళ్లిందన్నారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించారన్నారు. నలుగురికి తీవ్రగాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ ఘటన అనంతరం గ్రామస్థులు మృతదేహాలతో ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తుల డిమాండ్లు నెరవేరుస్తామని తెలపడంతో శాంతించారు. తక్షణ సాయం కింద రూ.2లక్షలు మృతుల కుటుంబాలకు అందజేయనున్నట్లు తెలిపారు. దీంతో గ్రామస్థులు ఆందోళనను విరమించారు. అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కాగా.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.

Also Read:

Crime News: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ల ముఠా అరెస్ట్‌.. రూ. కోటి విలువైన దుంగలు స్వాధీనం..

Cyber Crime: పెళ్లి సంబంధం పేరుతో టోకరా.. రూ.17.90 లక్షలు కాజేసిన వైనం..

టీమిండియాకు షాక్.. ఆ విషయంలో బీసీసీఐని వివరణ కోరిన ఐసీసీ..
టీమిండియాకు షాక్.. ఆ విషయంలో బీసీసీఐని వివరణ కోరిన ఐసీసీ..
పుష్ఫ 2 సినిమాకి డబ్బింగ్ పూర్తి చేసుకున్న షెకావత్ సార్
పుష్ఫ 2 సినిమాకి డబ్బింగ్ పూర్తి చేసుకున్న షెకావత్ సార్
కంటెంట్ ఉంటే కోట్లు.. లేదంటే పాట్లు.. చిన్న సినిమాలపై చిరు
కంటెంట్ ఉంటే కోట్లు.. లేదంటే పాట్లు.. చిన్న సినిమాలపై చిరు
డాక్టర్‌ లేకపోవడంతో... ఈ వాచ్‌మెనే ఇలా వైద్యుడు అయ్యాడు
డాక్టర్‌ లేకపోవడంతో... ఈ వాచ్‌మెనే ఇలా వైద్యుడు అయ్యాడు
తంతే బకెట్ బిర్యానీలో పడ్డారు.. కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు
తంతే బకెట్ బిర్యానీలో పడ్డారు.. కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు
పగలేమో పనోళ్లు.. రాత్రయితే ఆయుధ వ్యాపారులు
పగలేమో పనోళ్లు.. రాత్రయితే ఆయుధ వ్యాపారులు
ఫేక్ న్యూస్ ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా మారుతోంది: మంత్రి
ఫేక్ న్యూస్ ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా మారుతోంది: మంత్రి
ఐపీఎల్ మెగా వేలంలో ఐదుగురు వెటరన్ ప్లేయర్లు..
ఐపీఎల్ మెగా వేలంలో ఐదుగురు వెటరన్ ప్లేయర్లు..
టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆసీస్‌కు ఆ స్టార్ పేసర్
టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆసీస్‌కు ఆ స్టార్ పేసర్
బండి ఎక్స్‌పెయిరీ అయితే మాత్రం OLXలో కూడా అమ్మేందుకు వీలు లేదట
బండి ఎక్స్‌పెయిరీ అయితే మాత్రం OLXలో కూడా అమ్మేందుకు వీలు లేదట