Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నాగశౌర్య ఫాంహౌస్‌ పేకాట కేసులో 29 మందికి బెయిల్.. ప్రధాన నిందితుడికి నిరాకరణ

Hyderabad: హైదరాబాద్‌ నగర శివారులోని మంచిరేవుల ప్రాంతంలో టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌‌లో పేకాట ఆడుతూ 30 మంది అరెస్ట్ అయిన సంగతి

Hyderabad: నాగశౌర్య ఫాంహౌస్‌ పేకాట కేసులో 29 మందికి బెయిల్.. ప్రధాన నిందితుడికి నిరాకరణ
Nagashourya Farmhouse
Follow us
uppula Raju

|

Updated on: Nov 02, 2021 | 6:00 PM

Hyderabad: హైదరాబాద్‌ నగర శివారులోని మంచిరేవుల ప్రాంతంలో టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌‌లో పేకాట ఆడుతూ 30 మంది అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 29 మందికి ఉప్పర్ పల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌కి మాత్రం బెయిల్ నిరాకరించింది. వారం రోజుల కస్టడీ కోసం నార్సంగి పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు.ఈ నెల 5వ తేదీన కస్టడీ పిటీషన్ పై వాదోపవాదనలు జరగనున్నాయి.

రెండు రోజుల క్రితం మంచిరేవులలో పేకాట శిబిరం పై టీవీ9 -ఎస్వోటి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో 30 మంది పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నార్సింగి పోలీసులు వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. అయితే వీరిలో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్ పై గతంలోనూ పలు పీఎస్ లలో కేసులు నమోదయ్యాయి. గచ్చిబౌలీ, పంజాగుట్ట, కూకట్ పల్లి పీఎస్ లలో ఇతని పేరుపై కేసులున్నాయి.

అరెస్ట్ సమయంలో ఇక్కడ ఎక్విప్‌మెంట్ చూసి పోలీసులే కంగుతిన్నారు. క్యాసినోను తలపించే రేంజ్‌లో జరుగుతుంది బిజినెస్ ఇక్కడ. స్వైపింగ్ మిషీన్లున్నాయి. చిప్స్‌తో ఆట నిర్వహణ జరుగుతోంది. 6 లక్షల క్యాష్, స్వైపింగ్ మిషన్లు, కార్లు సీజ్ చేశారు. అయితే ఇది హీరో నాగ శౌర్య సొంత ఇల్లు కూడా కాదు.. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నుంచి ఐదేళ్ల పాటు లీజుకు తీసుకున్నాడని తెలుస్తోంది.

Sugar Prices: దేశంలో చక్కెర ధర ఎందుకు పెరుగుతుందో తెలుసా..? ఈ కారణాల వల్లే..

Honda Activa: 21 వేలకే హోండా యాక్టివా.. సంవత్సరం వారంటీ కూడా.. ఎక్కడంటే..?

Huzurabad By Poll Result : హుజూరాబాద్‌లో దుమ్మురేపుతున్న ఈటల.. రౌండ్ల వారీగా ఫలితాల వివరాలు మీకోసం..