Honda Activa: 21 వేలకే హోండా యాక్టివా.. సంవత్సరం వారంటీ కూడా.. ఎక్కడంటే..?

Honda Activa: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఏదైనా సరికొత్త బైక్ లేదా స్కూటర్ కొనాలంటే కనీసం 60 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో

Honda Activa: 21 వేలకే హోండా యాక్టివా.. సంవత్సరం వారంటీ కూడా.. ఎక్కడంటే..?
Honda
Follow us

|

Updated on: Nov 02, 2021 | 5:21 PM

Honda Activa: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఏదైనా సరికొత్త బైక్ లేదా స్కూటర్ కొనాలంటే కనీసం 60 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేనివారు తక్కువ బడ్జెట్‌లో వాహనాల కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికోసం ఒక మంచి అవకాశం వచ్చింది. కేవలం రూ.21 వేలకే హోండా యాక్టివా సొంతం చేసుకోవచ్చు. అది ఏ విధంగానో ఒక్కసారి తెలుసుకుందాం. హోండా యాక్టివా సెకండ్‌ హ్యాండ్‌ స్కూటర్ బైక్స్ 24 అనే వెబ్‌సైట్‌లో కొనుగోలు సిద్దంగా ఉంది.

ఒకవేళ మీరు ఈ హోండా యాక్టివాను షోరూమ్ నుంచి కొనుగోలు చేస్తే 70 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి హోండా యాక్టివా మైలేజ్, ఫీచర్లు , స్పెసిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హోండా యాక్టివాలో కంపెనీ 109.5 cc సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అమర్చింది. ఇది 7.68 bhp శక్తిని, 8.79 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఈ స్కూటర్‌కు మెరుగైన వేగాన్ని ఇస్తుంది. బ్రేకింగ్ సిస్టమ్ గురించి చెప్పాలంటే కంపెనీ దాని ముందు, వెనుక చక్రాలలో డ్రమ్ బ్రేక్‌లు, ట్యూబ్‌లెస్ టైర్లు ఇచ్చింది.

ఆకాశాన్నంటుతున్న పెట్రోల్ ధరల మధ్య ఈ హోండా యాక్టివా స్కూటర్ లీటర్ పెట్రోల్‌లో గరిష్టంగా 60 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. Bikes24 పేరుతో వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ హోండా యాక్టివా 2014 సంవత్సరం మోడల్. ఇది సెకండ్‌ హ్యాండ్‌ యాక్టివా స్కూటర్. ఇప్పటివరకు ఈ స్కూటర్ 29,103 కి.మీ ప్రయాణించింది. దీని రిజిస్ట్రేషన్ హర్యానాలోని HR-51 RTO లో ఉంది. ఈ బైక్‌ కొనుగోలు చేస్తే సంవత్సరం వారంటీ కూడా లభిస్తుంది.7 రోజుల మనీ బ్యాక్ గ్యారెంటీ కూడా ఇచ్చారు. అయితే ఏదైనా సెకండ్ హ్యాండ్ స్కూటర్ కొనుగోలు చేసే ముందు దాని గురించి పూర్తి సమాచారాన్ని చదివితే మంచిది. ఎందుకంటే మోసాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా అన్ని చెక్ చేసుకోవాలి.

గమనిక: ఈ సమాచారం కేవలం Bikes24 వెబ్‌సైట్‌ నుంచి తీసుకోబడింది.. దీనికి టీవీ9 సంస్థకి ఎలాంటి సంబంధం లేదని గుర్తించండి. మరిన్ని వివరాల కోసం Bikes24 వెబ్‌సైట్‌ని సందర్శించండి.

Virat Kohli: విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీపై నీలినీడలు.! త్వరలోనే నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ.!!

Dandruff: చుండ్రు సమస్యతో విసిగిపోయారా..! తక్కువ ఖర్చుతో ఇలా క్లియర్‌ చేసుకోండి..

Sleep Disorders: నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారా..! ఈ జ్యూస్‌ తాగారంటే కమ్ముకొస్తుంది..