AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PF ఖాతాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌..! ఇప్పుడు పెరిగిన డబ్బులు ఎంతో తెలుసుకోండి..

PF Clients: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి మీరు త్వరలో శుభవార్త అందుకుంటారు. 2020-21కి సంబంధించి ప్రావిడెంట్ ఫండ్స్‌పై 8.5 శాతం వడ్డీ

PF ఖాతాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌..! ఇప్పుడు పెరిగిన డబ్బులు ఎంతో తెలుసుకోండి..
Pf Clients
uppula Raju
|

Updated on: Nov 02, 2021 | 6:49 PM

Share

PF Clients: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి మీరు త్వరలో శుభవార్త అందుకుంటారు. 2020-21కి సంబంధించి ప్రావిడెంట్ ఫండ్స్‌పై 8.5 శాతం వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఆరు కోట్ల మందికి పైగా లబ్ధిదారులు వారి PF ఖాతాలపై 8.5% వడ్డీని పొందుతారు. కార్మిక మంత్రి నేతృత్వంలోని EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు గత సంవత్సరం మాదిరిగానే 8.5% వడ్డీ రేటును ఆమోదించారు. అయితే కార్మిక మంత్రిత్వ శాఖ తప్పనిసరిగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. శుక్రవారం ఆర్థిక శాఖ ఆమోదంతో EPFO చందాదారులు దీపావళికి ముందే వడ్డీని పొందే అవకాశం ఉంది.

ఈ నెల ప్రారంభంలో కార్మిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమై వారి సందేహాలకు సమాధానమిచ్చారు. అంతేకాదు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. గత సంవత్సరం 2019-20 ఆర్థిక సంవత్సరంలో KYCలో ఆటంకం కారణంగా చాలా మంది చందాదారులు వడ్డీ కోసం చాలా కాలం వేచి ఉండాల్సి వచ్చింది. EPFO 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేట్లను 8.5% వద్ద మార్చకుండా అలాగే ఉంచింది. ఇది గత 7 సంవత్సరాలలో అతి తక్కువ వడ్డీ రేటు. మీరు మిస్డ్ కాల్ లేదా SMS ద్వారా ఇంట్లో కూర్చొని మీ PF ఖాతా బ్యాలెన్స్‌ని సులభంగా చెక్ చేసుకోవచ్చు.

మీ PF డబ్బును చెక్ చేయడానికి మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. తర్వాత మీరు EPFO మెస్సేజ్‌ ద్వారా PF వివరాలను పొందుతారు. ఇక్కడ కూడ మీ UAN, PAN ఆధార్‌ను లింక్ చేయడం అవసరం. 1. epfindia.gov.inలో EPFO వెబ్‌సైట్‌కి లాగిన్ ఇవ్వండి. 2. ఈ-పాస్‌బుక్‌పై క్లిక్ చేయండి. 3. మీరు passbook.epfindia.gov.inకి వెళుతారు. 4. ఇప్పుడు మీ వినియోగదారు పేరు (UAN నంబర్), పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్‌ చేయండి. 5. అన్ని వివరాలు నింపిన తర్వాత మీరు కొత్త పేజీకి వస్తారు. ఇక్కడ మీరు సభ్యుల IDని ఎంచుకోవాలి. 6. ఇక్కడ మీరు ఈ-పాస్‌బుక్‌లో మీ EPF బ్యాలెన్స్ పొందుతారు.

IOCL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. IOCLలో బంపర్ పోస్టులు.. అర్హులు వీరే..

Huzurabad By Election 2021 Winner: ‘ఈటల’కే జై కోట్టిన హూజూరాబాద్ ఓటర్లు.. టీఆర్ఎస్‌పై భారీ మెజార్టీతో విజయ దుందుభి..

Virat Kohli: విరాట్ కోహ్లీ కుటుంబానికి బెదిరింపులు.. స్పందించిన డీసీడబ్ల్యూ.. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ