Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad By Election 2021 Winner: ‘ఈటల’కే జై కొట్టిన హూజూరాబాద్ ఓటర్లు.. టీఆర్ఎస్‌పై భారీ మెజార్టీతో విజయ దుందుభి..

Huzurabad By Poll Result : తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురు చూసిన ఫలితాలు రానే వచ్చాయి. పోలింగ్ వరకు నువ్వా నేనా అన్నట్లు ప్రచార పర్వం సాగితే..

Huzurabad By Election 2021 Winner: ‘ఈటల’కే జై కొట్టిన హూజూరాబాద్ ఓటర్లు.. టీఆర్ఎస్‌పై భారీ మెజార్టీతో విజయ దుందుభి..
Etela Rajender
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 02, 2021 | 10:12 PM

Huzurabad By Poll Result : తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురు చూసిన ఫలితాలు రానే వచ్చాయి. పోలింగ్ వరకు నువ్వా నేనా అన్నట్లు ప్రచార పర్వం సాగితే.. రిజల్ట్స్ మాత్రం వార్ వన్ సైడే అన్నట్లుగా వెలువడ్దాయి. ఎంతో ఉత్కంఠ భరితంగా ప్రారంభమైన హుజూరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. రౌండ్ రౌండ్‌లో ఈటలకు మెజార్టీ పెరిగిందే తప్ప.. ఎక్కడా తగ్గలేదు. వెరసి ప్రధాన ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై భారీ మెజార్టీ విజయ దుందుభి మోగించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగగా టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. ఆ తరువాత సాధారణ ఓట్ల లెక్కింపులో తొలి నుంచి లీడ్‌లో ఈటల రాజేందర్ కొనసాగారు. మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు రెండు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ ఆధిక్యాన్ని కనబరిచారు. మొత్తంగా తగ్గేదే లే అన్న రీతిలో ఈటల రాజేందర్ 23,865 ఓట్ల భారీ మెజార్టీతో టీఆర్ఎస్‌పై జయకేతనం ఎగురవేశారు.

రౌండ్ల వారీగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు పోలైన ఓట్లు, లీడ్ వివరాలు మీకోసం.. 1. బీజేపీ – 4610 : టీఆర్ఎస్ – 4444 = బీజేపీ లీడ్ – 166. 2. బీజేపీ – 4851 : టీఆర్ఎస్ – 4659 = బీజేపీ లీడ్ – 192. (టోటల్ లీడ్-358) 3. బీజేపీ – 4064 : టీఆర్ఎస్ – 3159 = బీజేపీ లీడ్ – 905 (1263) 4. బీజేపీ – 4444 : టీఆర్ఎస్ – 3882 = బీజేపీ లీడ్ 562 (1825) 5. బీజేపీ – 4358 : టీఆర్ఎస్ – 4014 = బీజేపీ లీడ్ 344 (2169) 6. బీజేపీ – 4656 : టీఆర్ఎస్ – 3639 = బీజేపీ లీడ్ 1017 (3186) 7. బీజేపీ – 4038 : టీఆర్ఎస్ – 3792 = బీజేపీ లీడ్ 246 (3432) 8. బీజేపీ – 4086 : టీఆర్ఎస్ – 4248 = టీఆర్ఎస్ లీడ్ 162 (3270) 9. బీజేపీ – 5305 : టీఆర్ఎస్ – 3470 = బీజేపీ లీడ్ 1835 (5105) 10. బీజేపీ – 4295 : టీఆర్ఎస్ – 3709 = బీజేపీ లీడ్ 586 (5691) 11. బీజేపీ – 3941 : టీఆర్ఎస్ – 4326 = టీఆర్ఎస్ లీడ్ 385 (5306) 12. బీజేపీ – 4849 : టీఆర్ఎస్ – 3632 = బీజేపీ లీడ్ 1217 (6523) 13. బీజేపీ – 4846 : టీఆర్ఎస్ – 2971 = బీజేపీ లీడ్ 1865 (8388) 14. బీజేపీ – 4746 : టీఆర్ఎస్ -3700= బీజేపీ లీడ్ 1046 (9434) 15. బీజేపీ – 5,507 : టీఆర్ఎస్ – 3,358 = బీజేపీ లీడ్ 2149 (11,157) 16. బీజేపీ – 5,689 : టీఆర్ఎస్ – 3,917 = బీజేపీ లీడ్ 1,712 (13,255) 17. బీజేపీ – 5,610 : టీఆర్ఎస్ – 4,187 = బీజేపీ లీడ్ 1,423 (14,618) 18. బీజేపీ – 5,611 : టీఆర్ఎస్ – 3,735 = బీజేపీ లీడ్ 1,876 (16,494) 19. బీజేపీ – 5,910 : టీఆర్ఎస్ – 2,869 = బీజేపీ లీడ్ 3,047 (19,535) 20. బీజేపీ – 5,269 : టీఆర్ఎస్ – 3,795 = బీజేపీ లీడ్ 1,474 (21,015) 21. బీజేపీ – 5,151 : టీఆర్ఎస్ – 3,431 = బీజేపీ లీడ్ 1,720 (22,735) 22. బీజేపీ – 4,481 : టీఆర్ఎస్ – 3,351 = బీజేపీ లీడ్ 1,130 (23,865)

Also read:

Diwali 2021: బాణాసంచా కాల్చే సమయంలో కంటి రక్షణ కోసం తీసుకోవాలిన జాగ్రత్తలు.. మీకోసం..

Aha 2.O-Allu Arjun:మొదలైన ‘ఆహా 2.0’ సందడి చేయనున్న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. (లైవ్ వీడియో)

KTR: అందరికి ధన్యవాదాలు.. 20 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఎత్తుపల్లలు చూసింది..