AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: అందరికి ధన్యవాదాలు.. 20 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఎత్తుపల్లలు చూసింది..

టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హుజురాబాద్ ఉపఎన్నికల్లో ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్నారు....

KTR: అందరికి ధన్యవాదాలు.. 20 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఎత్తుపల్లలు చూసింది..
KTR
Srinivas Chekkilla
|

Updated on: Nov 02, 2021 | 6:39 PM

Share

టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాలపై స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ గత 20 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లలు చూసిందని చెప్పారు. రాజకీయంలో గెలుపు ఓటములు సాధారణమని అన్నారు. ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని పిలుపునిచ్చారు.

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పౌరసఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‎కు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు చెప్పారు. హుజరాబాద్‎లో కష్టపడ్డ ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లు, క్యాడర్‎, సోషల్ మీడియా వారియర్స్‎కి ధన్యవాదాలు చెప్పారు. మంచి స్ఫూర్తితో పోరాడిన గెల్లు శ్రీనివాస్‎కు అభినందనలు చెప్పారు.

హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపొందారు. ఈటల రాజేందర్ 23,865 ఓట్ల భారీ మెజార్టీతో టీఆర్ఎస్‌పై జయకేతనం ఎగురవేశారు.

Read Also.. Manickam Tagore: హుజూరాబాద్ ఫలితాలపై ఆ తర్వాతే స్పందిస్తాం.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్..