Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dandruff: చుండ్రు సమస్యతో విసిగిపోయారా..! తక్కువ ఖర్చుతో ఇలా క్లియర్‌ చేసుకోండి..

Dandruff: చుండ్రు సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు బయటతిరగలేకపోతున్నారు. ఇప్పటికే చాలామంది రకరకాల షాంపులను వాడి ఉంటారు.

Dandruff: చుండ్రు సమస్యతో విసిగిపోయారా..! తక్కువ ఖర్చుతో ఇలా క్లియర్‌ చేసుకోండి..
Dandruff
Follow us
uppula Raju

|

Updated on: Nov 02, 2021 | 4:07 PM

Dandruff: చుండ్రు సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు బయటతిరగలేకపోతున్నారు. ఇప్పటికే చాలామంది రకరకాల షాంపులను వాడి ఉంటారు. వైద్యుడి దగ్గరకు వెళ్లి చికిత్స తీసుకొని చాలా రకాలుగా ప్రయత్నించి ఉంటారు. కానీ వీటివల్ల కొద్దిరోజులు మాత్రమే ఫలితం ఉంటుంది. సమస్య పూర్తిగా తొలగిపోదు. ఈ రోజుల్లో వాతావరణ మార్పులు, పొల్యూషన్ చుండ్రుకి కారణమవుతుంది. అంతేకాకుండా నీటి కారణంగా కూడా చుండ్రు ఏర్పడుతుంది. దీనిని తొలగించాలంటే ఆయుర్వేదంలో చక్కటి పద్దతులను వివరించారు. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

కొద్దిగా వెనిగ‌ర్ తీసుకుని దాన్ని నీళ్లలో క‌లిపి జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాల పాటు ఉంచుకొని ఆరిన తర్వాత త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల చుండ్రు త‌గ్గుతుంది. ముఖ్యంగా దుర‌ద‌తో కూడిన చుండ్రు స‌మ‌స్య నుంచి మంచి విముక్తి పొంద‌వ‌చ్చు. అలాగే కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని నీటితో క‌లిపి దాన్ని జుట్టుకు ప‌ట్టించాలి. 30 నిమిషాలు ఆగాక త‌ల‌స్నానం చేయాలి. బేకింగ్ సోడాలో యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల బాక్టీరియా న‌శిస్తుంది. చుండ్రు త‌గ్గుతుంది.

మరో పద్దతిలో కొన్ని వేపాకుల‌ను తీసుకుని పేస్ట్‌లా చేసి జుట్టుకు ప‌ట్టించాలి. 1 గంట సేపు ఆరిన తర్వాత త‌ల‌స్నానం చేయాలి. వేపాకుల్లోనూ యాంటీ ఫంగ‌ల్, యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు ఉంటాయి. దీని వ‌ల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చుండ్రు తగ్గిపోతుంది. మీరు వాడే సాధార‌ణ షాంపూలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్‌ను క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్రమంతో త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇంకో పద్దతిలో క‌ల‌బంద గుజ్జును జుట్టుకు బాగా రాసి 1 గంట‌ల సేప‌య్యాక త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే చుండ్రు సమస్యతో పాటు జుట్టు కూడా అందంగా తయారవుతాయి.

Sleep Disorders: నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారా..! ఈ జ్యూస్‌ తాగారంటే కమ్ముకొస్తుంది..

Himachal Bypoll Results: బీజేపీకి భారీ షాక్.. హిమాచల్ ప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్..

AP Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాగల మూడు రోజులు ఏపీకి భారీ వర్ష సూచన..