AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mariamma Custodial Death: మరియమ్మ లాకప్ డెత్ కేసులో కీలక మలుపు.. ఎస్సై‌తో సహా ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు..

Mariamma Custodial Death: ఖమ్మం జిల్లాలో దళిత మహిళ మరియమ్మ లాకప్‌ డెత్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి

Mariamma Custodial Death: మరియమ్మ లాకప్ డెత్ కేసులో కీలక మలుపు.. ఎస్సై‌తో సహా ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు..
Cp Mahesh Bhagwat
Shiva Prajapati
|

Updated on: Jul 21, 2021 | 7:40 AM

Share

Mariamma Custodial Death: ఖమ్మం జిల్లాలో దళిత మహిళ మరియమ్మ లాకప్‌ డెత్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అడ్డగూడురు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ వి మహేశ్వర్, కానిస్టేబుళ్లు ఎంఏ రషీద్, పి. జానయ్యను విధుల నుంచి పూర్తిగా తొలగించారు. ఇప్పటి వరకు సస్పెన్షన్‌లో ఉన్న వీరిని.. పూర్తిస్థాయి విచారణ అనంతరం విధుల నుంచి పూర్తిగా తొలగిస్తూ రాచకొండ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఖమ్మం జిల్లాలోని అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో కస్టడీలో ఉన్న దళిత మహిళ మరియమ్మ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. మరియమ్మ మృతిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. అందుకు బాధ్యులైన ఎస్ఐ మహేశ్వర్, కానిస్టేబుళ్లు రషీద్ పటేల్, జానయ్యలను సస్పెండ్ చేసింది. పూర్తిస్థాయి విచారణ జరిపించాల్సిందిగా రాచకొండ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించిన పోలీసు ఉన్నతాధికారులు.. తప్పు జరిగినట్లుగా తేల్చారు.

ఈ క్రమంలోనే బుధవారం నాడు రాచకొండ కమీషనరేట్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సస్పెన్షన్ ఉన్న ఎస్ఐ వి. మహేశ్వర్, పిసి 3056 ఎంఏ రషీద్ పటేల్, పిసి 2012 పి. జానయ్యను రాజ్యంగంలోని ఆక్టికల్ 311(2)(b), 25(2) ప్రకారం విధులను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డిస్మసల్ ఆర్డర్స్ మంగళవారం నుంచే వర్తిస్తాయని స్పష్టం చేశారు.

Also read:

Horoscope Today: ఈ రాశివారికి అన్నింటా విజయాలే.. బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.!

Rakul Preet Singh: హాటెస్ట్ ఫిట్నెస్ ఫ్రీక్… జిమ్ లో చమట్లు చిందిస్తోన్న అందాల రకుల్.. వీడియో వైరల్

Covid-19: కరోనా ముప్పు అప్పుడే పోలేదు.. దేశంలో మూడింట రెండొంతుల మందికి యాంటీబాడీస్.. ఐసీఎంఆర్‌ సెరో సర్వేలో ఆసక్తికర విషయాలు