Horoscope Today: ఈ రాశివారికి అన్నింటా విజయాలే.. బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.!

కొంతమందికి జోతిష్యం, రాశిఫలాలపై నమ్మకం ఉంటుంది. వారు ఏం చేసినా.? ఏదైనా పనికి శ్రీకారం చుట్టాలన్నా శుభముహూర్తాన్ని ఎంచుకుంటారు.

Horoscope Today: ఈ రాశివారికి అన్నింటా విజయాలే.. బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.!
Horoscope
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 21, 2021 | 7:58 AM

కొంతమందికి జోతిష్యం, రాశిఫలాలపై నమ్మకం ఉంటుంది. వారు ఏం చేసినా.? ఏదైనా పనికి శ్రీకారం చుట్టాలన్నా శుభముహూర్తాన్ని ఎంచుకుంటారు. మరి అసలు ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయి.? ఏ రాశివారికి ప్రయోజనాలు అందుతాయి.? ఎవరు శుభవార్తలు పొందుతారు.? పనులు అన్నీ కూడా ఆటంకాలు లేకుండా పూర్తవుతాయా.? అనేది రాశిఫలాలు ఆధారంగా తెలుసుకుందాం..!

మేషం:

చేపట్టిన కార్యక్రమాల్లో విజయం పొందుతారు. శ్రమకు తగిన ఫలితం, తోటివారి నుంచి సహాయసహకారాలు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభం:

విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనోధైర్యంతో చేసే పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఆర్ధికంగా స్థిరపడేందుకు మార్గాలు ఎంచుకుంటారు.

మిథునం:

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషం, శుభవార్తలు వింటారు.

కర్కాటకం:

కుటుంబ మద్దతు, శారీరక శ్రమ, స్నేహితుల సహాయసహకారాలు, శ్రమకు తగిన ఫలితం.

సింహం:

ఈ రాశివారికి కొంచెం ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. మనోధైర్యం మిమ్మల్ని అన్నింటా విజయానికి చేరువ చేస్తుంది. కొన్ని వ్యవహారాల్లో జాగ్రత్త తప్పనిసరి, శివనామస్మరణ మేలు చేస్తుంది.

కన్య:

అభివృద్ధిలో భాగంగా తొలి విజయం అందుతుంది. కుటుంబసభ్యుల సహాయసహకారాలు, పైఅధికారుల మద్దతు, నూతన వస్తువుల కొనుగోలు.

తుల:

కష్టానికి తగిన ఫలితం, అనుకోని ఖర్చులు, చేపట్టిన పనులను ఓ ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు. దైవ దర్శనాలు మేలు చేస్తాయి

వృశ్చికం:

ఈ రోజు ఈ రాశివారు అన్నింటా ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, చేపట్టే పనులు.. ఇలా ప్రతీ విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయాలి. శరీర సౌఖ్యం కలదు.

ధనుస్సు:

శారీరిక శ్రమ, ఆపదలు తొలుగుతాయి, మానసికంగా బాధను కలిగించే సంఘటనలకు దూరంగా ఉండండి. శివారాధన మంచి చేస్తుంది

మకరం:

వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సంఘటనలు జరుగుతాయి. మీరు చేసే పనులతో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు.

కుంభం:

ఓ శుభవార్త ఇంటిల్లిపాదీకి సంతోషాన్ని నింపుతుంది. కీలక వ్యవహారంలో ఆర్ధిక సాయం లభిస్తుంది. అనుకున్న పనులను విజయవంతంగా ముగిస్తారు.

మీనం:

కుటుంబసభ్యుల సహాయసహకారాలు. ఆర్ధిక సాయం లభిస్తుంది. నవగ్రహ స్త్రోతం చదివితే బాగుంటుంది.

Also Read:

మీ పర్సులో డబ్బులు నిలవాలంటే.. ఈ వస్తువులు ఉంచుకోకూడదు.! అవేంటంటే..

పాము, ముంగీస మధ్య హోరాహోరీ ఫైట్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే.!