Telangana Crime News: కిలాడీ లేడీస్.. కాస్ట్లీ చీరలే టార్గెట్.. దొంగతనం చేసిన 24 గంటల్లోనే కటకటాల వెనక్కు..!
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో చీరలు దొంగలించే మహిళా దొంగలను పోలీసులు అరెస్ట్ చేసారు. కొత్తగూడ మండల కేంద్రంలోనీ ఓ బట్టల షాపులో ...
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో చీరలు దొంగలించే మహిళా దొంగలను పోలీసులు అరెస్ట్ చేసారు. కొత్తగూడ మండల కేంద్రంలోనీ ఓ బట్టల షాపులో విలువైన చీరలను అత్యంత చాకచక్యంగా కాజేశారు ఇద్దరు మహిళలు. విజయ, ఉషారాణి అనే ఇద్దరు మహిళలు బట్టల షాపుకు వచ్చారు. షాపు యజమాని నరేష్‌ను ఓ మహిళ మాటల్లో పెట్టగా.. మరో మహిళ ఇరవై ఎనిమిది వేలు విలువగల చీరెలను బ్యాగులో సర్దేసింది. ఇద్దరూ కలిసి అనుకున్న ప్లాన్ అమలు చేసి.. ఖరీదైన చీరలతో చెక్కేశారు. తేరుకున్న షాపు ఓనర్ చీరలు కనిపించకపోవడంతో కంగారుపడి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగతనం కేసును 24 గంటల్లోనే చేధించారు. ఆ ఇద్దరు మహిళలు ఇదే తరహాలో వేరే చోట దొంగతనానికీ పాల్పడుతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. గతంలో ఈ ఇద్దరు మహిళలపై పలు స్టేషన్ లలో అనేక కేసులు నమోదైనట్లు స్థానిక ఎస్సై తెలిపారు.
2019లో సంచలనం సృష్టించిన శకుంతలమ్మ హత్యకేసులో నిందితుడి అరెస్ట్
2019లో విజయనగరం జిల్లా సాలూరులో సంచలనం రేకిత్తించిన శకుంతలమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన చికెన్ పకోడి వ్యాపారానికి అడ్డొస్తోందని కక్ష్య పెంచుకున్న షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి…. పరిసర ప్రాంతాల్లో జనసంచారం లేని సమయంలో వృద్దురాలి ఇంటిలోకి ప్రవేశించి తలగడతో హతమార్చాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2019 నుంచి పోలీసులు నిందితుడిపై నిఘా పెట్టారు. అప్పటి నుంచి దొరక్కుండా తిరుగుతున్న ఇమ్రాన్ బంగారు గాజులు అమ్మడానికి ప్రయత్నిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. నిందితుడిని అరెస్టు చేసి ఏడున్నర తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేవలం చికెన్ పకోడీ వ్యాపారానికి అడ్డొస్తోందన్న కోపంతోనే ఇమ్రాన్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. తెలంగాణ సర్కార్ నిర్ణయం