గుంటూరు జిల్లాలో కరోనాతో ఆస్పత్రిలో చేరిన కుటుంబం.. తిరిగి ఇంటికి వ‌చ్చి చూడ‌గా షాక్

ప్రస్తుతం క‌రోనా టెర్ర‌ర్ క్రియేట్ చేస్తోంది. జనాలు తీవ్ర భ‌యంలో, నైరాశ్యంలో, ఆవేద‌న‌లో ఉన్నారు. అస‌లు ఈ మ‌హ‌మ్మారికి ఒక అంతం అంటూ ఉందా...

గుంటూరు జిల్లాలో కరోనాతో ఆస్పత్రిలో చేరిన కుటుంబం.. తిరిగి ఇంటికి వ‌చ్చి చూడ‌గా షాక్
Pedakurapadu Robbery
Follow us

|

Updated on: May 17, 2021 | 10:12 AM

ప్రస్తుతం క‌రోనా టెర్ర‌ర్ క్రియేట్ చేస్తోంది. జనాలు తీవ్ర భ‌యంలో, నైరాశ్యంలో, ఆవేద‌న‌లో ఉన్నారు. అస‌లు ఈ మ‌హ‌మ్మారికి ఒక అంతం అంటూ ఉందా అనే అనుమానంలో ఉన్నారు. ఈ స‌మ‌యంలో కూడా కొంద‌రు దుండ‌గులు రెచ్చిపోతున్నారు. అమాయ‌క ప్ర‌జ‌ల ప‌రిస్థితుల‌ను ఆస‌రాగా చేసుకుని దోపిడీల‌కు తెగ‌బ‌డుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో కరోనా సోక‌డంతో ఆ కుటుంబం ఆస్పత్రిలో చేరింది. ట్రీట్మెంట్ తర్వాత ఇంటికొచ్చి చూసి షాక్ కు గుర‌య్యారు. పెదకూరపాడు మండలం పాటిబండ్లకు చెందిన గార్లపాటి పూర్ణచంద్రరావు ఇంట్లో చిల్లర కొట్టు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నెల 3న ఆయన వైర‌స్ కార‌ణంగా చనిపోయారు. ఆయన భార్య నాగచంద్రిక, వారి ఇద్దరు కుమార్తెలు, తల్లి కొవిడ్ టెస్టులు చేయించుకుంటే పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఈనెల 6న గుంటూరులోని అడవితక్కెళ్లపాడు క్వారంటైన్‌ సెంటర్‌లో చేరారు.

చికిత్స అనంత‌రం ఫ్యామిలీలో అంద‌రూ కరోనా నుంచి కోలుకున్నారు.. పరీక్షల్లో వారికి నెగిటివ్‌గా రాడంతో ఆదివారం ఇంటికి వచ్చారు. తాళం తీసి ఇంట్లోకి వెళ్లి చూడగా షాక్ కు గురయ్యారు. ఇంట్లో దొంగ‌లు ప‌డ్డ‌ట్లు గుర్తించారు. బీరువాను తెరిచి అందులోని 20 సవర్ల బంగారం, రూ.2 లక్షల డబ్బు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క‌రోనా బారినపడి కుటుంబ పెద్దను కోల్పోయామని.. ఇప్పుడు తమకు ఈ చోరీతో ఆర్థిక ఇబ్బందులు తప్పవని వారు ఆవేద‌న చెందుతున్నారు.

Also Read:  క‌రోనా క‌ల్లోలంలోనూ క్షుద్రపూజలు.. ఆదివారం వ‌చ్చిందంటే అక్క‌డ వ‌ణుకు

ఈ ఫోన్ పైత్యం ఏంటి బ్ర‌ద‌ర్.. గుంత‌లో ప‌డ్డాక కూడానా.. న‌వ్వులు పూయిస్తున్న వీడియో