చిత్తూరు జిల్లాలో సంవత్సర కాలంగా 80 అడుగుల సొరంగం తవ్వేశారు.. కారణం తెలిసి అంతా షాక్
తిరుపతి శేషాచలం అటవీలో ఓ సొరంగం చర్చనీయాంశమైంది. సంవత్సరకాలానికి పైగా గుట్టుచప్పుడు కాకుండా ఈ తతంగం సాగుతున్నట్లు సమాచారం.
తిరుపతి శేషాచలం అటవీలో ఓ సొరంగం చర్చనీయాంశమైంది. సంవత్సరకాలానికి పైగా గుట్టుచప్పుడు కాకుండా ఈ తతంగం సాగుతున్నట్లు సమాచారం. ఎట్టకేలకు అలిపిరి పోలీసులు కిలాడీ గ్యాంగ్ కు అదుపులోకి తీసుకుని.. ఈ సొరంగం వెనుక అసలు కథ తేల్చారు. వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లికి చెందిన పెయింటర్ నాయుడు 2014లో తిరుపతికి వచ్చి ఇక్కడే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గొడవల కారణంగా భార్యను కూడా వదిలేశాడు. ఎం.ఆర్.పల్లెలో ఉంటూ కూలీల మేస్త్రీగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి గుప్త నిధులవైపు ఆశ మల్లింది. రాత్రికి రాత్రే సంపన్నుడు అవ్వాలనుకున్నాడు. ఈ క్రమంలో నెల్లూరుకు చెందిన రామయ్యస్వామితో అతడికి పరిచయం ఏర్పడింది. కొన్ని పురాతన రాగిరేకులను అంచనా వేసి శేషాచలం అడవుల్లో గుప్త నిధి ఉందని డిసైడయ్యారు.
నాయుడు, రామయ్యస్వామిలు కలిసి ఆరుగురు కూలీలను జతచేసుకున్నారు. అందరూ కలిసి తవ్వకాలు మొదలుపెట్టారు. విషయం బయటకు పొక్కకుండా సైలెంట్ గా సొరంగం తవ్వుతున్నారు. ఈ గ్యాంగ్ 80 అడుగుల లోతు వరకు సొరంగాన్ని తవ్వింది. శుక్రవారం రాత్రి కూలీలతో వెళ్లగా.. మంగళం వెంకటేశ్వర కాలనీ దగ్గర్లో వీరందరూ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వెంటనే స్థానికులు అలిపిరి పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకోగా.. గుప్త నిధుల తవ్వకాలకు వచ్చినట్లు విచారణలో ఒప్పుకున్నారు. మిగిలిన నలుగురినీ కూడా అరెస్ట్ చేశారు. నిధిని సొంతం చేసుకునేందుకు మరో 40 అడుగుల మేరకు తవ్వాలనుకున్నారు.. ఇంతలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
Also Read: గుంటూరు జిల్లాలో కరోనాతో ఆస్పత్రిలో చేరిన కుటుంబం.. తిరిగి ఇంటికి వచ్చి చూడగా షాక్