Remdesivir Fraud: ఆగ‌ని రెమ్‌డెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ల అక్ర‌మ దందా.. రామ‌గుండంలో మ‌రో ముఠా అరెస్ట్..

Remdesivir Fraud: క‌రోనా క‌ష్ట కాలాన్ని సైతం నేర‌గాళ్లు త‌మ మోసాల‌కు వాడుకుంటున్నారు. క‌రోనా బాధితుల‌కు చికిత్స‌లో భాగంగా ఉప‌యోగించే రెమ్‌డెసివిర్ ఇంజ‌క్ష‌న్ల‌ను అక్ర‌మంగా విక్ర‌యిస్తూ...

Remdesivir Fraud: ఆగ‌ని రెమ్‌డెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ల అక్ర‌మ దందా.. రామ‌గుండంలో మ‌రో ముఠా అరెస్ట్..
Remdesivir Fraud
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 17, 2021 | 11:16 AM

Remdesivir Fraud: క‌రోనా క‌ష్ట కాలాన్ని సైతం నేర‌గాళ్లు త‌మ మోసాల‌కు వాడుకుంటున్నారు. క‌రోనా బాధితుల‌కు చికిత్స‌లో భాగంగా ఉప‌యోగించే రెమ్‌డెసివిర్ ఇంజ‌క్ష‌న్ల‌ను అక్ర‌మంగా విక్ర‌యిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్లో రూ. 30 వేల‌కు అమ్ముకుంటూ అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా ఇలాంటి మ‌రో ఘ‌ట‌న రామ‌గుండంలో బ‌య‌ట‌ప‌డింది.

నకిలీ దందా ఇలా న‌డుస్తోంది..

జిల్లా కేంద్రంలోని హెల్త్‌కేర్‌, పల్స్‌ హాస్పిటళ్లకు చెందిన ఇద్దరు సిబ్బందితోపాటు మరో ఇద్దరు అంబులెన్స్‌ నిర్వాహకులు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో రూ.25 వేల నుంచి రూ.30 వేలకు విక్ర‌యిస్తున్నారు. కొవిడ్‌ బారిన పడి చికిత్స నిమిత్తం ఆయా ఆస్పత్రులలో అడ్మిట్‌ అయిన రోగుల వివరాలను సేక‌రించి.. వారికి రెమ్‌డెసివిర్ ఇంజ‌క్ష‌న్లు అందిస్తామ‌ని న‌మ్మిస్తున్నారు. ఇందులో భాగంగా రోగుల నుంచి స‌మాచారాన్ని సేక‌రించింది. న‌కిలీ ప్రిస్కిప్ష‌న్ త‌యారు చేసి హైదరాబాద్ నుంచి ఇంజ‌క్ష‌న్ల‌ను తెప్పిస్తున్నారు. అనంత‌రం ఇంజ‌క్ష‌న్లు దొర‌క‌డం లేద‌ని చెప్పి బ్లాక్ తెప్పిస్తున్నామ‌ని బాధితుల నుంచి ఏకంగా రూ.30 వేలు వ‌సూళు చేస్తున్నారు. రోగులు దీనికి అంగీక‌రించిన వెంట‌నే.. బెల్లంపల్లికి చెందిన పల్లె రమేష్‌ (పల్స్‌ హాస్పిటల్‌)లు అంబులెన్స్‌ నిర్వాహకులైన తిర్యాణికి చెందిన పులి సంతోష్‌, మంచిర్యాలకు చెందిన పున్నం రంజిత్‌కుమార్‌లు రోగుల బంధువుల వద్ద డబ్బులు తీసుకొని ఇంజక్షన్లు ఇస్తారు. ఈ దందాలో వచ్చిన డబ్బులను నలుగురు పంచుకుంటారు.

Remdesivir Fraud 1

Remdesivir Fraud 1

అక్ర‌మార్కుల‌ను ప‌ట్టుకున్న స్పెష‌ల్ టీమ్‌..

రెమ్‌డెసివిర్ పేరుతో జ‌రుగుతున్న ఈ అక్ర‌మ దందాలో భాగ‌స్వామ్యులైన వారిని రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు సీఐ ముత్తి లింగయ్య, టాస్క్‌ఫోర్స్‌ సీఐ రాజ్‌కుమార్‌ల పర్యవేక్షణలో ప్రత్యేక టీం పట్టుకున్నారు. అనంత‌రం సంఘటనకు సంబంధించి ఆదివారం ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పోలీసులు గొట్టి రాజేందర్‌, పల్లె రమేష్‌, పులి సంతోష్‌లను అరెస్టు చేయగా, పున్నం రంజిత్‌కుమార్‌ పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి ఐదు రెమ్‌డెసివిర్‌ ఇం జక్షన్లతోపాటు ఓ అంబులెన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

రెమ్‌డెసివిర్ అక్రమ దందా ముఠా అరెస్ట్..Watch video

Also Read: గుంటూరు జిల్లాలో కరోనాతో ఆస్పత్రిలో చేరిన కుటుంబం.. తిరిగి ఇంటికి వ‌చ్చి చూడ‌గా షాక్

COVID Vaccine: హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో వృధాగా పోయిన 60 వేల కరోనా వ్యాక్సిన్లు.. ఎందుకంటే..

Sai Pallavi: సాయి పల్లవి రిజక్ట్ చేసిన సినిమాలు ఏవో తెలుసా.. ఆ స్టార్ హీరోలకు కూడా ఫిదా బ్యూటీ నో చెప్పిందా..

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ