Road accident: పెళ్లి చేసుకుని అత్తారింటికి బయలుదేరి వధువు.. అంతాలోనే ప్రమాదం.. వరుడి పరిస్థితి విషమం
Road accident: మరికొన్ని గంటలాగితే మొట్టమొదటిసారి మెట్టినింట్లో అడుగుపెట్టే అరుదైన అనుభూతి కలిగేది. కానీ.. విధి ఆ వధువుతో చెలగాటమాడింది. భర్తను తానే దగ్గరుండి..
Road accident: మరికొన్ని గంటలాగితే మొట్టమొదటిసారి మెట్టినింట్లో అడుగుపెట్టే అరుదైన అనుభూతి కలిగేది. కానీ.. విధి ఆ వధువుతో చెలగాటమాడింది. భర్తను తానే దగ్గరుండి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. నవ దంపతులకు ఎదురైన ఈ ట్రాజిక్ ఎక్స్‌పీరియన్స్ క్రిష్ణా జిల్లా గన్నవరం పరిధిలో జరిగింది. అత్తిలిలో పెళ్లి చేసుకొని హైదరాబాదులోని వరుడి నివాసానికి కారులో వెళుతోందామె. మరో ముగ్గురితో కలిసి ఈ నవదంపతులు ప్రయాణిస్తున్న కారు.. దారిలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఐదుగురూ కారులోంచి ఎగిరి అవతల పడ్డారు. పెళ్లికొడుకు శంకర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. నెత్తుటి మడుగులో పడివున్న భర్తను చూసి కంగారుపడుతూనే.. 108కి ఫోన్ చేసిందామె.
క్రిష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం జాతీయ రహదారిపై రుచి పామాయిల్ కంపెనీ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంలో గాయపడ్డ బాధితులను గాయత్రి, రేణుక, శివశంకర్, సీతారావమ్మ, శరత్‌గా గుర్తించారు. అందరినీ అంబులెన్స్‌లో చిన్న అవుటపల్లి పిన్నమనేని ఆసుపత్రికి ఐదుగురిని తరలించారు. పెళ్ళికొడుకు శంకర్ పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ మణిపాల్ హాస్పిటల్‌కి తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి