Telangana: తెలంగాణ క్యాడర్ ఐఏఎస్‌పై అత్యాచార ఆరోపణలు.. కన్నీటి పర్యంతమవుతోన్న యువతి

తెలంగాణ క్యాడర్ ఐఏఎస్‌ అధికారి కాళీచరణ్‌ లైంగిక వేధింపులకి పాల్పడి తన జీవితాన్ని స్పాయిల్ చేశాడని కన్నీటి పర్యంతమవుతోంది ఓ యువతి. కాఫీలో మత్తు మందిచ్చి అత్యాచారం చేశాడని ఆరోపిస్తుంది.

Telangana: తెలంగాణ క్యాడర్ ఐఏఎస్‌పై అత్యాచార ఆరోపణలు.. కన్నీటి పర్యంతమవుతోన్న యువతి
Kalicharan Khartade Ias
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 04, 2022 | 5:00 PM

IAS Khartade Kalicharan: ఐఏఎస్‌ అధికారి కాళీచరణ్‌ తనపై అత్యాచారం చేశారంటూ ఓ యువతి సంచలన ఆరోపణలు చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డ్‌లో పనిచేస్తున్నాడు కాళీచరణ్‌. లైంగిక వేధింపులకి పాల్పడి తన జీవితాన్ని స్పాయిల్ చేశాడని కన్నీటి పర్యంతమవుతోంది సదరు యువతి.  2018లో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో ఓఎస్డీగా పనిచేశాడు కాళీచరణ్‌. ఆ సమయంలో సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్న యువతికి గైడ్ చేస్తానని మాయమాటలు చెప్పి… నోట్స్‌ ఇస్తానని తెలంగాణ భవన్‌కి పిలిపించి కాఫీలో మత్తు మందిచ్చి అత్యాచారం చేశాడన్నది ఆరోపణ. కాగా నిర్వాకాన్నంతా దొంగచాటుగా షూట్ చేశాడన్నది బాధితురాలి వెర్షన్. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిల్‌కి దిగి చాలాసార్లు అత్యాచారం చేశాడని ఆరోపిస్తోంది బాధితురాలు. జరిగిన దారుణంపై 2019లో తండ్రితో కలిసి అధికారులకి ఫిర్యాదు చేసింది. దీంతో ఎక్కడ తన ఉద్యోగం పోతుందోనని భయపడ్డ కాళీచరణ్‌.. ఆర్యసమాజ్‌(Arya Samaj)కి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడట.

కాళీ చరణ్‌కి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆవేవీ చెప్పకుండా బాధితురాలిని రెండోసారి పెళ్లి చేసుకున్నాడన్నది సదరు యువతి వెర్షన్. అదేమని ప్రశ్నిస్తే బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడట. తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని న్యాయపోరాటానికి దిగింది. కానీ ఎక్కడా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. సీఎంల నుంచి పీఎం దాకా.. ఢిల్లీ మహిళా కమిషన్ నుంచి జాతీయ మహిళా కమిషన్‌దాకా.. ఎక్కడ ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదంటోంది బాధితురాలు. ఉన్నతస్థాయిలో ఉన్న కాళీచరణ్‌కి అధికార యంత్రాంగమంతా భయపడిపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాళీ చరణ్‌ ముందస్తు బెయిల్‌ని కోర్టు తిరస్కరించింది. అయినా పోలీసులు ఇప్పటిదాకా ఎలాంటి చర్యలకు సాహసించలేదు.

నిజంగా కాళీచరణ్‌ అన్యాయం చేశాడా?

ఐఏఎస్‌ హోదాలో ఉన్న కాళీచరణ్‌.. అన్ని యంత్రాంగాలను మ్యానేజ్ చేస్తున్నాడన్నది బాధితురాలు ఆరోపణ. అందుకే కాళ్లకి చెప్పులరిగేలా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటోంది. నిజంగా కాళీ చరణ్‌ అమ్మాయికి అన్యాయం చేశాడా? ఒకవేళ చేయకుంటే ఎందుకు ఖండించడం లేదు? మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని చెబుతున్న అధికార యంత్రాంగాలు బాధితురాలికి ఎలాంటి న్యాయం చేస్తాయన్నది చూడాలి. కాగా ఈ ఆరోపణలపై కాళీచరణ్‌ వెర్షన్ తీసుకునేందుకు ప్రయత్నించగా.. ఆయన నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.

Also Read: తిరుమలకు వెళ్లే వెంకన్న భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్.. 

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!