భార్యాభర్తల మధ్య నెలకొన్న తగాదా.. సర్దిచెప్పకుండా భర్తను చితక్కొట్టిన పోలీసులు.. ఇప్పుడు నడవలేని స్థితిలో..
శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులే కర్కసులుగా మారుతున్నారు. భార్యా, భర్తల మధ్య నెలకొన్న తగాదాలో జోక్యం చేసుకున్నారు. సర్దిచెప్పాల్సింది పోయి విచారణ చితక్కొట్టారు
శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులే కర్కసులుగా మారుతున్నారు. భార్యా, భర్తల మధ్య నెలకొన్న తగాదాలో జోక్యం చేసుకున్నారు. సర్దిచెప్పాల్సింది పోయి విచారణ చితక్కొట్టారు. దీంతో ఆ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
కొందరు పోలీసులు… మానవత్వం మరచి ప్రవర్తిస్తున్నారు. మాటలతో పరిష్కరించాల్సిన గొడవలకు కూడా లాఠీకి పని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఓ ఎగ్జాంపుల్‌గా కనిపిస్తోంది. నడవలేని స్థితిలో ఉన్న ఇతని పేరే చిత్తిరి బాలకృష్ణ. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బురిడికంచరాం గ్రామనివాసి. చాలా ఏళ్ల క్రితం ఇతనికి రాజ్యలక్ష్మితో వివాహమైంది. ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అవి ఎక్కువ కావడంతో మనస్తాపంతో భార్య రాజ్యలక్ష్మి… పొందూరు పోలీసు స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్సై దేవానంద్… బాకృష్ణను విచారణకు పిలిచారు. పిలిచి చావబాదారని బాలకృష్ణ బంధువులు ఆరోపిస్తున్నారు. విచారణ పేరుతో పిలిచి ఇలా కొట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. కుమారుడి దీన స్థితి చూసి బాలకృష్ణ తల్లి బోరున విలపించింది. ఆమె రోదన అక్కడి వార్ని కలచి వేసింది.
దెబ్బలతో తిరిగి గ్రామానికి వచ్చిన బాలకృష్ణను తిరిగి పొందూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు గ్రామస్థులు. ఇంతలా కొట్టడానికి బాలకృష్ణ చేసిన తప్పేంటని… అసలు తప్పేంటో తెలియకుండా ఎలా కొడతారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బాధితుడు బాలకృష్ణ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. విచారణ పేరుతో పిలిచి విచక్షణా రహితంగా చావ బాదిన ఎస్సైపై బంధువులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
Also Read:
ఎంత మాయో చూడండి.. స్వాములోరి హుండీని తెరిస్తే కేవలం రూపాయి మాత్రమే ఉంది.. అసలు ఏం జరిగిందంటే
Treasure hunt: మహాశివరాత్రి వేళ గుప్తనిధుల వేట.. తవ్వగా.. తవ్వగా… చివరికి ఊహించని ట్విస్ట్…