AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై దాడి.. బ్యాగ్ లాక్కొని పరారీ.. చివరకు కటకటాల్లోకి

రైలు దిగి కుటుంబసభ్యులతో ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతే.. గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి అతనిని అడ్డగించారు. బ్యాగ్ లాక్కొని కత్తితో పొడిచారు. అనంతరం అక్కడి నుంచి...

నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై దాడి.. బ్యాగ్ లాక్కొని పరారీ.. చివరకు కటకటాల్లోకి
Blade Batch
Ganesh Mudavath
|

Updated on: Feb 25, 2022 | 12:05 PM

Share

రైలు దిగి కుటుంబసభ్యులతో ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతే.. గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి అతనిని అడ్డగించారు. బ్యాగ్ లాక్కొని కత్తితో పొడిచారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురినీ అరెస్టు(Arrest) చేశారు. అయితే.. గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి(death) చెందడం విషాదం నింపింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి(Dhawaleshwaram) చెందిన వి.ఆంజనేయులు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 22న నెల్లూరు నుంచి రైలు దిగి ఇంటికి వెళ్తుండగా అయిదుబళ్ల మార్కెట్‌ వద్ద ముగ్గురు వ్యక్తులు బైక్ పై అడ్డగించారు. బ్యాగు లాక్కుని, కత్తితో పొడిచి పరారయ్యారు. బాధితుడు ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో కుటుంబసభ్యులు అప్రమత్తమయ్యారు. వెంటనే వచ్చి ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆంజనేయులు బుధవారం మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. బ్రాడీపేటకి చెందిన సురేష్‌, తాడితోట ఇందిరానగర్‌కు చెందిన గోవిందరాజులు, కొత్తపేట సొమలమ్మ గుడి ప్రాంతానికి చెందిన పోలవరపు ప్రసాద్‌ ఈ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించి వారిని అరెస్టు చేశారు. 24 గంట వ్యవధిలోనే నిందితులను పట్టుకున్న సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Also Read

Mahindra Finance: కస్టమర్ల కోసం మహీంద్రా ఫైనాన్స్‌ ప్రత్యేక డిపాజిట్‌ పథకం.. వారికి ఎక్కువ వడ్డీ రేటు..!

Tax Deduction: హోమ్‌లోన్‌పై అదిరిపోయే బెనిఫిట్‌.. మార్చి 31 వరకే అవకాశం..!

Viral Video: స్టూడెంట్స్‌ను క్రమశిక్షణలో పెట్టాలంటే ఇంత కఠినంగా వ్యవహరించాలా?.. టీచర్లపై మండిపడుతున్న నెటిజన్లు..

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!