Cannabis Gang Arrested: గంజాయి ముఠా అరెస్ట్.. విశాఖ ఏజెన్సీ నుంచి తెలంగాణకు తరలిస్తుండగా పట్టివేత..

Cannabis Gang Arrested: విశాఖ ఏజెన్సీ నుంచి తెలంగాణలోని జహీరాబాద్‌‌తో పాటు మహారాష్ట్ర బోర్డర్ ప్రాంతాలకు అక్రమంగా గంజాయి విక్రయించే ముఠాను రాచకొండ

Cannabis Gang Arrested: గంజాయి ముఠా అరెస్ట్..  విశాఖ ఏజెన్సీ నుంచి తెలంగాణకు తరలిస్తుండగా పట్టివేత..

Cannabis Gang Arrested: విశాఖ ఏజెన్సీ నుంచి తెలంగాణలోని జహీరాబాద్‌‌తో పాటు మహారాష్ట్ర బోర్డర్ ప్రాంతాలకు అక్రమంగా గంజాయి విక్రయించే ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ నుంచి జహీరాబాద్‌కు వస్తుండగా మార్గమధ్యలో పెద్ద అంబర్ పేట క్రాస్ రోడ్ వద్ద రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్ఓటీ) పోలీసులు, హయత్ నగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన పాతాల నాగేష్ గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. తనకు సన్నిహితంగా ఉండే మరో 7గురి మిత్రులతో కలిసి గంజాయిని విశాఖ ఏజెన్సీ నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో విక్రయించడంతో అధిక లాభాలు పొందవచ్చని భావించాడు. ఈ ప్రకారమే విశాఖ ఏజెన్సీలో గంజాయిని కేజీ రూ.3000 లకు మాత్రమే కొనుగోలు చేసి జహీరాబాద్, ఇతర పరిసర ప్రాంతాలలో మాత్రం కేజీ గంజాయిని రూ.10 వేలకు విక్రయించేవాడు.

అందుకు జహీరాబాద్ పట్టణానికి చెందిన కార్తీక్ రాథోడ్‌తో అంగీకార ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో పాతాల నాగేష్ గతేడాది గంజాయి తరలిస్తుండగా జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్నుంచి జహీరాబాద్ పోలీసులకు వాంటెడ్ గా ఉన్నాడు. ఇదిలా ఉండగా, మరోసారి గంజాయిని కొనుగోలు చేసి హైచర్ వాహనంలో జహీరాబాద్ తరలించేందుకు యత్నించిన పాతాల నాగేష్ ముఠాను ఎల్‌బీనగర్ సమీపంలోని పెద్దఅంబర్‌పేట క్రాస్ రోడ్డు వద్దకు రాగానే రాచకొండ ఎస్ఓటీ, హయత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వీరి నుంచి హైచర్ వాహనంలో 300 ప్యాకెట్ లలో సుమారు 650 కేజీల గంజాయితో పాటు ఎస్కార్ట్ గా వచ్చిన మారుతి ఎర్జిగ వాహనాన్ని, రూ.60 వేల నగదు, 10 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 15 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు.

Cannabis Cultivation In Goa: గంజాయి సాగుకు అనుమతిచ్చిన గోవా ప్రభుత్వం.. కానీ షరతులు వర్తిస్తాయి..

విశాఖ జిల్లాలో రూ.3.85 కోట్ల గంజాయి పట్టివేత…తరలింపు కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలు..కేటుగాళ్ల రూటే సెపరేట్