ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి ఏర్పాట్లు.. పెళ్లి మరో వ్యక్తితో అని తెలిసిన నవ వధువు ఏం చేసిందంటే…?

కొద్ది గంటల్లో పెళ్లి ఉందనగా వధువు ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది.

ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి ఏర్పాట్లు.. పెళ్లి మరో వ్యక్తితో అని తెలిసిన నవ వధువు ఏం చేసిందంటే...?

సిరిసిల్ల జిల్లాలో ఓ పెళ్లి కుమార్తె చేసిన పని ఆ కుటుంబాన్ని నవ్వులపాలు చేసింది. కొద్ది గంటల్లో పెళ్లి ఉందనగా వధువు ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. మరికొద్ది గంటల్లో పెళ్లి ఉందనగా ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో తల్లిదండ్రులు, బంధువుల కోలాహలంతో పెళ్లి పనులు జోరుగా సాగుతున్న వేళ ఈ విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు. సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లికి చెందిన యువతీ యువకులు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరి తల్లిదండ్రులను ఒప్పించారు. దీంతో వారి వివాహానికి పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. ఇందుకు తగ్గట్లుగా ఘనంగా ఏర్పాట్లు చేశారు. అయితే, ఆ యువతి తల్లిదండ్రులు గురువారం మరో అబ్బాయితే పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో ఆ యువతి .. ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని చెప్పి లెటర్ రాసి గురువారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లి పోయింది. లెటర్ చూసి షాక్ కు గురైన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. పారిపోయిన జంట కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also:

కుమరం భీం జిల్లాలో తీవ్ర విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో అన్నదమ్ముళ్ల ఆత్మహత్య.. రైలు కిందపడి మృతి..!