AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వీడేం మొగుడు.. భార్య పడకగది వీడియోలతో ఏం చేశాడో తెలిస్తే.. రక్తం మరగడం ఖాయం..

Hyderabad: భరించే వాడినే భర్త అంటారు. తనతో ఏడడగులు నడిచి, వందేళ్లు బతకడానికి వచ్చే భార్యను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రతీ మగాడిపై ఉంటుంది. అందుకే పెళ్లిలో...

Hyderabad: వీడేం మొగుడు.. భార్య పడకగది వీడియోలతో ఏం చేశాడో తెలిస్తే.. రక్తం మరగడం ఖాయం..
Narender Vaitla
|

Updated on: Aug 01, 2022 | 6:22 PM

Share

Hyderabad: భరించే వాడినే భర్త అంటారు. తనతో ఏడడగులు నడిచి, వందేళ్లు బతకడానికి వచ్చే భార్యను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రతీ మగాడిపై ఉంటుంది. అందుకే పెళ్లిలో అగ్ని సాక్షిగా భార్యకు తోడుగా ఉంటానని ప్రమాణం చేయిస్తారు. అయితే ఓ ప్రబుద్ధుడు మాత్రం అగ్ని సాక్షిగా చేసిన ప్రమాణాలను మరిచిపోయాడు. కనీస సంస్కారాన్ని మరిచిపోయి కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హింసించాడు. సభ్య సమాజం తలదించుకునేలా తన వికృత చేష్టలతో నరకం చూపించాడు.

వివరాల్లోకి వెళితే.. శంషాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి 2016లో వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో రూ. 5 లక్షల నగదు, 9 తులాల బంగారు ఆభరణాలను కట్నంగా తీసుకున్నాడు. కొన్ని రోజుల పాటు వీరి సంసారం సవ్యంగా సాగినా ఆ తర్వాత కసాయి భర్త అసలు రూపం బయట పడింది. చేస్తున్న వ్యాపారాన్ని మానేసి జులాయిగా తిరగడం ప్రారంభించాడు, ఖర్చులకు డబ్బులు లేక అదనపు కట్నం కోసం భార్యను వేధించడం ప్రారంభించాడు. అతని పప్పులు ఉడకకపోవడంతో బెడ్‌ రూమ్‌లో భార్యతో గడిపిన అశ్లీల దృశ్యాలను సెల్‌ ఫోన్‌లో సీక్రెట్‌గా చిత్రీకరించాడు.

అనంతరం ఆ వీడియోను స్నేహితుడితో షేర్‌ చేశాడు. ఈ విషయం తెలిసిన భార్య ఏంటీ పని నిలదీయడంతో.. తన ఫ్రెండ్‌తో ఏకాంతంగా గడపాలని ఒత్తిడి చేశాడు. జరిగిన ఈ ఘోరాన్ని అత్త, మామల దృష్టికి తీసుకెళ్లగా దండించాల్సింది పోగా, కుమారుడి నిర్వాకాన్ని సమర్థించి అదనపు కట్నం తేవాలని హెచ్చరించారు. టార్చర్‌ తీవ్రతరం కావడంతో సదరు మహిళ శంషాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు భర్త, అత్తమామలతో పాటు మరో ముగ్గురిపై ఆదివారం కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..