Telangana: మైండ్ బ్లాంకయ్యే సీన్.. 14లీటర్లు పట్టే బైక్ ట్యాంకులో 17 లీటర్ల పెట్రోల్ కొట్టిన బంక్ స్టాఫ్

లీటర్ పెట్రోల్ 120 రూపాయల మార్క్‌ను టచ్ చేసేందుకు సిద్దంగా ఉంది. ఈ ధరలతో ఎలారా దేవుడా అని తలబాదుకుంటుంటే, పెట్రోల్ బంకుల్లో మోసాలు జనాన్ని మరింత కలవరానికి గురి చేస్తున్నాయి.

Telangana: మైండ్ బ్లాంకయ్యే సీన్.. 14లీటర్లు పట్టే బైక్ ట్యాంకులో 17 లీటర్ల పెట్రోల్ కొట్టిన బంక్ స్టాఫ్
representative image
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 03, 2022 | 4:32 PM

బంక్‌లకు వెళ్లి పెట్రోల్ కొట్టిస్తున్నారా..? మనం ఇచ్చిన డబ్బుకు సరిపడా ఆయిల్ కొట్టారని భావిస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్ని ఏమార్చి.. జేబులకు చిల్లు పెట్టే ఆస్కారం ఉంది. తాజాగా  నాగార్జునసాగర్(Nagarjuna Sagar) పెట్రోల్ పంపులో ఘారానా మోసం జరుగుతోంది. 14లీటర్ల పట్టే బైక్ పెట్రోల్ ట్యాంకులో 17 లీటర్లు కొట్టారు. అనుమానంతో మళ్ళీ పెట్రోల్ కొట్టించగా 14 లీటర్లు పట్టింది. 14 లీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంకులో 17 లీటర్లు ఎలా పడుతుందని ప్రశ్నిస్తే.. సంబంధం లేని సమాధానాలు చెప్పారు పెట్రోల్ బంక్ నిర్వాహకులు. దీంతో బంకు దగ్గర కస్టమర్లు ఆందోళనకు దిగారు. బంకు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్ ధరలతో గగ్గోలు పెడుతున్నారు సామాన్య ప్రజలు. అది చాలదన్నట్టు కల్తీ రాయుళ్లు, ఇలాంటి కిలాడీలు తమ ప్రతాపం చూపుతున్నారు. లీటర్ పెట్రోల్ 120 రూపాయల మార్క్‌ను టచ్ చేసేందుకు సిద్దంగా ఉంది. ఈ ధరలతో ఎలారా దేవుడా అని తలబాదుకుంటుంటే, పెట్రోల్ బంకుల్లో మోసాలు జనాన్ని మరింత కలవరానికి గురి చేస్తున్నాయి. పెట్రో ధరలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బంకుల్లో జరుగుతున్న మోసాలపై సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చీటింగ్ చేస్తున్న  బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు స్థానికులు.

Also Read: తన కుమార్తె నిహారికపై వస్తున్న వార్తలపై నటుడు నాగబాబు క్లారిటీ