AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఒక సిట్టింగ్‌లో ఎనీ సర్టిఫికెట్.. 8 ఏళ్ల క్రితం చీటింగ్.. ఇప్పుడు అరెస్ట్..

వన్ సిట్టింగ్ లో టెన్త్, ఇంటర్, డిగ్రీ చదువుకోవచ్చు.. మమ్మల్ని సంప్రదించండి అన్న యాడ్స్‌ను తరుచూ చూస్తుంటే వాళ్ళం. ఇలానే చీటింగ్ చేసేవాళ్లు కూడా ఉన్నారు జాగ్రత్త.

Andhra: ఒక సిట్టింగ్‌లో ఎనీ సర్టిఫికెట్.. 8 ఏళ్ల  క్రితం చీటింగ్.. ఇప్పుడు అరెస్ట్..
Cheating Case
Ram Naramaneni
|

Updated on: Apr 03, 2022 | 7:17 PM

Share

Guntur district: వన్ సిట్టింగ్ లో టెన్త్, ఇంటర్, డిగ్రీ చదువుకోవచ్చు.. మమ్మల్ని సంప్రదించండి అన్న యాడ్స్ ను గతంలో తరుచూ చూస్తుంటే వాళ్ళం. ఎనిమిదేళ్ల క్రితం విజయవాడలోని ఐఎంసిఈ అనే కన్సల్టెన్సీ పేపర్ లో ఒక యాడ్ ఇచ్చింది. అది చూసిన విజయవాడ(Vijayawada)కే చెందిన మహేష్ రెడ్డి ఐఎంసిఏ వద్దకు వెళ్ళాడు. తాను డిస్టెన్స్ లో డి ఫార్మసీ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రంలోని సేలం జిల్లాలో ఉన్న వినాయక మిషన్ యూనివర్సిటీ నుండి డిస్టెన్స్ లో డి ఫార్మసీ చెయ్యొచ్చని ఐఎంసిఈ కన్సల్టెన్సీ ప్రతినిధులు శ్రీనివాస్, కిషోర్…. మహేష్ రెడ్డితో చెప్పారు.. అందుకు 1,50,000 రూపాయలు ఖర్చవుతుందని ఆమొత్తాన్ని మహేష్ రెడ్డి వద్ద నుండి వసూలు చేశారు. ఆ తర్వాత సేలం తీసుకెళ్ళి అక్కడ లాడ్జిలో కూర్చోబెట్టి ఎగ్జామ్స్ రాయించారు. ఫలితాలు వచ్చిన తర్వాత సేలం తీసుకెళ్ళి సర్టిఫికెట్లు ఇచ్చారు. సర్టిఫికేట్స్ తీసుకున్న కొన్నాళ్ళ తర్వాత మెడికల్ షాపు పెట్టుకోవటానికి ఆ సర్టిఫికేట్ సాయంతో గుంటూరు చుట్టుగుంటలో ఉన్న ఫార్మసీ కౌన్సిల్ కి మహేష్ దరఖాస్తు చేసుకున్నాడు.

ఆ సర్టిఫికేట్స్ పరిశీలించిన అధికారులకు వాటిపై అనుమానం వచ్చింది. వాటిని తమిళనాడు పంపి పరిశీలించగా ఫేక్ సర్టిఫికెట్లుగా నిర్థారణ అయ్యింది. వెంటనే ఫార్మసీ కౌన్సిల్ గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.‌‌ దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మహేష్ రెడ్డి వద్ద పూర్తి సమాచారం తీసుకొన్నారు. జరిగినదంతా తెలుసుకున్న పోలీసులు ప్రస్తుతం ఏలూరులో ఉంటున్న శ్రీనివాస్, కిషోర్ లను అరెస్టు చేశారు. విచారణ సమయంలో హైదరాబాద్ లోని తనకు తెలిసిన సెయింట్ ఫ్లోరా ఎడ్యుకేషనల్ అకాడెమీ నుండి ఫేక్ సర్టిఫికెట్లు చేయించి మహేష్ రెడ్డికి ఇచ్చినట్లు శ్రీనివాస్ ఒప్పుకున్నాడు. అవి ఫేక్ కాదని నమ్మించడానికే ఎగ్జామ్స్ రాయించామని శ్రీనివాస్ చెప్పాడని గుంటూరూ వెస్ట్ డిఎస్పీ సుప్రజ తెలిపారు. కేసును చేధించిన సిబ్బందిని ఆమె అభినందించారు.

రిపోర్టర్:టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు.

Also Read: Rahul Sipligunj: రాత్రి పబ్‌లో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పిన రాహుల్ సిప్లిగంజ్

ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు