AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో లష్కరే తోయిబా మాడ్యూల్ ఛేదించిన పోలీసులు.. ఐదుగురు అరెస్ట్!

జమ్మూ కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో లష్కరే తోయిబాకు చెందిన రెండు మాడ్యూళ్లను పోలీసులు ఛేదించారు.

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో లష్కరే తోయిబా మాడ్యూల్ ఛేదించిన పోలీసులు.. ఐదుగురు అరెస్ట్!
Jammu Kashmir
Balaraju Goud
|

Updated on: Apr 03, 2022 | 6:45 PM

Share

Lashkar-E-Taiba Module: జమ్మూ కాశ్మీర్‌(Jammu Kashmir)లోని బందిపోరా(Bandipora) జిల్లాలో లష్కరే తోయిబాకు చెందిన రెండు మాడ్యూళ్లను పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించి ఐదుగురు ఉగ్రవాదుల సహచరులను అరెస్టు చేశారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. నిర్దిష్ట ఇన్‌పుట్ ఆధారంగా, పోలీసులు భద్రతా దళాలతో కలిసి ఉత్తర కాశ్మీర్ జిల్లాలో నలుగురు ఉగ్రవాదుల సహచరులను అరెస్టు చేసినట్లు పోలీసు ప్రతినిధి తెలిపారు. వారిని అష్టాంగుల నివాసి ఇర్ఫాన్ అహ్మద్ భట్, కాజీపొరా నివాసి ఇర్ఫాన్ అహ్మద్ జాన్, సజ్జాద్ అహ్మద్ మీర్, బండిపొరాలోని అరిన్ ప్రాంతంలో నివసిస్తున్న షరీక్ అహ్మద్ మీర్‌గా గుర్తించారు.

వారి నుంచి రెండు చైనా గ్రెనేడ్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికార ప్రతినిధి తెలిపారు. జిల్లాలో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులకు మొబైల్ సిమ్ కార్డులు, లాజిస్టిక్స్ సపోర్టులో ఇతడు ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ కొనసాగిస్తున్నామని అధికార ప్రతినిధి తెలిపారు.

మరో ఘటనలో ఉగ్రవాదుల సహచరుడి అరెస్ట్ మరో ఘటనలో, బండిపోరాలోని రఖ్ హజిన్ ప్రాంతంలోని చెక్ పోస్ట్ వద్ద భద్రతా బలగాలతో పాటు పోలీసులు ఉగ్రవాదుల సహచరుడిని అరెస్టు చేశారు. అతడిని హజిన్‌లో నివాసముంటున్న ఇర్ఫాన్ అజీజ్ భట్‌గా గుర్తించినట్లు అధికార ప్రతినిధి తెలిపారు. అతని వద్ద నుంచి చైనా గ్రెనేడ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టయిన నిందితుడు పాక్ ఉగ్రవాది ఉమర్ లాలాతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయని, హజిన్ ప్రాంతంలో ఉగ్రదాడులకు ఆదేశించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికార ప్రతినిధి తెలిపారు. హజిన్ హతమైన ఉగ్రవాది సలీం పర్రేతో కూడా భట్ టచ్‌లో ఉన్నాడని ఆయన చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also…  US Firing: కాలిఫోర్నియాలో విచక్షణారహిత కాల్పులు.. 13 మంది మృతి, పలువురికి గాయాలు