AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accidents: వరుస ప్రమాదాలు.. కాలి బూడిదవుతున్న వాహనాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఘటనలు..

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బాపులపాడు మండలం బొమ్ములూరు వద్ద జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టింది లారీ. ఒక్కసారిగా వాహనం నుంచి మంటలు చెలరేగి..

Road Accidents: వరుస ప్రమాదాలు.. కాలి బూడిదవుతున్న వాహనాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఘటనలు..
Road Accidents
Sanjay Kasula
|

Updated on: Apr 26, 2022 | 8:19 AM

Share

వరుస ప్రమాదాలు..(Road accidents) కాలి బూడిదవుతున్న వాహనాలు.. ఇటీవలి కాలంలో తరచూ జరుగులున్న ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వేసవి కాలంలో ఎండతాపానికి  వెంటనే మంటలు ఎగసిపడి అగ్నికి ఆహుతవుతున్నాయి. ఇక ఉదయం సమయంలో చిన్న ప్రమాదాలకు గాలి తోడవంటో పెద్ద వాహనం పూర్తిస్థాయిలో తగలబడుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బాపులపాడు మండలం బొమ్ములూరు వద్ద జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టింది లారీ. ఒక్కసారిగా వాహనం నుంచి మంటలు చెలరేగి కంటైనర్‌లోని సరుకు పూర్తిగా కాలిపోయింది. హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కంటైనర్‌ అమెజాన్‌ కంపెనీకి చెందినదిగా గుర్తించారు.

ఇక ఆదిలాబాద్‌ NH 44పై మరో లారీ అదుపుతప్పి బోల్తా పడింది. వెంటనే మంటలు ఎగసిపడి పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌కు కొబ్బరి బోండాలతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫైరింజన్‌ సాయంతో మంటలు అదుపుచేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలవకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

జైనథ్ మండలం చందా వద్ద జాతీయ రహదారి 44 పై అదుపు తప్పి బోల్తా పడ్డ కొబ్బరి బొండాల లారీ. హైదరబాద్ నుండి నాగపూర్ వెళుతుండగా ఘటన. లారీ బోల్తా పడటంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. లారీకి నిప్పంటుకుని ఎగిసిపడుతున్న మంటలు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పైర్ సిబ్బంది. పైరింజన్ సాయంతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. రోడ్డు పై కొబ్బరి బొండాలు చెల్లాచెదురుగా పడటంతో రాకపోకలకు అంతరాయం..

ఇవి కూడా చదవండి: Elon Musk Buy Twitter: ఎలన్‌ మస్క్‌ చేతిలోకి ట్విట్టర్‌ పిట్ట.. 44 బిలియన్‌ డాలర్లకు డీల్‌..

Teething in Babies: మీ పిల్లలకి పళ్ళు వస్తున్నాయా.. అప్పుడు మీరు చేయాల్సిన పనులు ఇవే..