Crime: భార్యపై ప్రేమతో ఆ భర్త చేసిన పనికి వణికిపోయిన గ్రామస్థులు.. పోలీసులు రంగప్రవేశంతో మారిపోయిన సీన్
అన్ని బంధాల్లోకెల్లా భార్యాభర్తల బంధం చాలా గొప్పది. ఇద్దరు వ్యక్తులను జీవితాంతం కలిపి ఉంచే వైవాహిక బంధంలో కలహాలు సాధారణమే. అంతే కాకుండా ప్రేమ కూడా ఎక్కువే. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉన్నప్పుడే వారి బంధం..

అన్ని బంధాల్లోకెల్లా భార్యాభర్తల బంధం చాలా గొప్పది. ఇద్దరు వ్యక్తులను జీవితాంతం కలిపి ఉంచే వైవాహిక బంధంలో కలహాలు సాధారణమే. అంతే కాకుండా ప్రేమ కూడా ఎక్కువే. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉన్నప్పుడే వారి బంధం చక్కగా ఉంటుంది. భార్యపై ప్రేమతో ప్రతి ఒక్క భర్త, భర్తపై ప్రేమతో భార్య రకరకాల పనులు చేస్తుంటారు. వారికి నచ్చినవిధంగా నడుచుకోవడంతో పాటు జీవితాంతం గుర్తుండిపోయేలా టూర్లకు తీసుకెళ్లడం, బహుమతులు ఇవ్వడం వంటివి చేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన భార్యపై ప్రేమతో చేసిన పని మాత్రం ఊ ఊపి ప్రజలను భయంతో వణికించింది. ఇంతకీ ఆయన ఏం చేశాడో తెలుసా.. మధ్యప్రదేశ్‌లోని డిండౌరీ జిల్లాకు చెందిన ఓంకార్ దాస్ స్థానిక ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి రుక్మిణి అనే మహిళతో వివాహమైంది. వారికి సంతానం కలగలేదు. పెళ్లయినప్పటి నుంచి భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించారు. పిల్లలు లేకపోవడంతో తామే ఒకరికొకరు పిల్లలం అనుకుంటూ ప్రేమగా జీవించారు. ఈ క్రమంలో రుక్మిణి అనారోగ్యానికి గురైంది. వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు కొన్ని మందులు సూచించారు. అవి వాడినా ఆరోగ్యం చక్కబడకపోవడంతో రుక్మణి అనారోగ్యంతో మృతి చెందింది.
భార్య చనిపోయిందన్న బాధను తట్టుకోలేని ఓంకార్ ఇంట్లోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అయినా ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్థులు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఘటనపై ఎస్డీఎం బల్వీర్ రామన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో స్థానిక తహశీల్దార్ పోలీసులతో కలిసి ఓంకార్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి, నర్మదా నది ఒడ్డున పాతిపెట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


