Etela Rajendar: బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు మరో షాక్.. నోటిసులు జారీ చేసిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే
బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌కు మరో షాక్ తగిలింది. ఆయన కుటుంబానికి సంబంధించిన జమునా హర్చరీస్ సంస్థకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే తాజాగా నోటీసులు జారీ చేశారు.
Notice to Etela Rajendar: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా కేసులో విచారణ వేగవంతమైంది. కరోనా కారణంగా ఇన్నాళ్లు విచారణ పెండింగ్‌లో పడింది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి విచారణ చేయను్నారు. అచ్చంపేట, హాకీంపేటలో కూడా సర్వే కొనసాగనుంది. జమునాహ్యాచరీస్‌కు జూన్‌లోనే నోటీసులు జారీ చేశారు. అయితే కరోనా కారణంగా విచారణ ముందుకు సాగలేదు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో విచారణ వేగవంతం చేయనున్నారు.
బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు మరో షాక్ తగిలింది. ఆయన కుటుంబానికి సంబంధించిన జమునా హర్చరీస్ సంస్థకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే తాజాగా నోటీసులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని నోటిసుల్లో కోరింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచంపేట, హకీమ్‌పేట గ్రామాల్లో అసైన్డ్ భూములు కబ్జా చేసినట్లు ఈటెల కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ సర్కార్‌లో మంత్రిగా ఉన్న ఈటల బర్తరఫ్‌కు గురయ్యారు. అనంతరం ఎమ్మెల్యే పదివికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో మరోసారి విషయం సాధించిన సంగతి తెలసిందే.
అయితే, ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హర్చరీస్‌కు జూన్‌లోనే నోటీసులు జారీ చేసినప్పటికీ.. కోవిడ్ దృష్ట్యా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడింది. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో 16 న పూర్తిస్థాయిలో విచారణ జరుగనుంది.
Read Also… Sania Mirza Cheering: భర్త షాయబ్ మాలిక్ సిక్సర్ల మోత.. పాక్ క్రికెటర్ ఆటను ఎంజాయ్ చేసిన సానియా..