AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phonepe Scam: ఫోన్‌పే వాడుతున్నారా.? అయితే జాగ్రత్తగా ఉండండి.. ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి.

Phonepe Scam: డిజిటల్‌ వ్యాలెట్లు వచ్చినప్పటీ నుంచి మనీ ట్రాన్సాక్షన్‌ చాలా సులభంగా మారిపోయింది. బ్యాంకుతో సంబంధం లేకుండా జస్ట్‌ ఒక చిన్న క్లిక్‌తో ఒకరి నుంచి మరొకరు డబ్బులు పంపించుకుంటున్నారు. అది కూడా ఉచితంగా.. దీంతో భారత్‌లో డిజిటల్‌ వ్యాలెట్లకు బాగా క్రేజ్‌ పెరిగింది...

Phonepe Scam: ఫోన్‌పే వాడుతున్నారా.? అయితే జాగ్రత్తగా ఉండండి.. ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి.
Phonepe Scam
Narender Vaitla
|

Updated on: Apr 06, 2021 | 9:43 AM

Share

Phonepe Scam: డిజిటల్‌ వ్యాలెట్లు వచ్చినప్పటీ నుంచి మనీ ట్రాన్సాక్షన్‌ చాలా సులభంగా మారిపోయింది. బ్యాంకుతో సంబంధం లేకుండా జస్ట్‌ ఒక చిన్న క్లిక్‌తో ఒకరి నుంచి మరొకరు డబ్బులు పంపించుకుంటున్నారు. అది కూడా ఉచితంగా.. దీంతో భారత్‌లో డిజిటల్‌ వ్యాలెట్లకు బాగా క్రేజ్‌ పెరిగింది. టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద దుకాణాల వరకు డిజిటల్‌ పేమెంట్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే టెక్నాలజీ పెరిగిందని సంతోషించే లోపే వాటి ద్వారా జరుగుతోన్న మోసాలు భయపెట్టిస్తున్నాయి. ఇటీవల గుంటూరులో జరిగిన ఓ మోసమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి ఇటీవల తన మిత్రుడు ఒకరికి ఫోన్‌పై ద్వారా రూ. 400 పంపించాడు. అయితే అకౌంట్‌లో నుంచి డబ్బులు అయితే కట్‌ అయ్యాయి.. కానీ సదరు వ్యక్తికి మాత్రం జమ కాలేవు. దీంతో నాగరాజు కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసిన విషయాన్ని తెలిపాడు. అయితే కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులు సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా నాగరాజుకు ఎవరో తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఫోన్‌పే కస్టమర్‌ కేర్‌ నుంచి కాల్‌ చేస్తున్నాం.. మీ రూ.400 తిరిగి జమ చేస్తామని నమ్మించాడు. మొబైల్‌ ఫోన్‌కు ఓ వెరిఫికేషన్‌ కోడ్‌ వచ్చిందని అది చెప్పమని అన్నాడు. దీంతో నాగరాజు ఆ మాటలు నమ్మి అవతలి వ్యక్తికి కోడ్‌ చెప్పాడు. ఆ కోడ్‌ చెప్పిన వెంటనే నాగరాజు అకౌంట్‌ నుంచి రూ.49,248 విత్ డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. ఆ డబ్బు ఎందుకు డ్రా అయ్యాయని నాగరాజు అడగ్గా..మరో కోడ్‌ పంపామని.. అది చెప్తే మొత్తం డబ్బు జమ చేస్తామన్నాడు. అయితే ఈసారి మళ్లీ అకౌంట్‌ నుంచి రూ. 48,657 కట్‌ అయ్యాయి. దీంతో వెంటనే సదరు వ్యక్తికి కాల్‌ చేయడంతో ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. అప్పుడు కానీ తెలియలేదు తాను మోసపోయాడని. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. రూ. 400 కోసం చూసుకుంటే ఏకంగా రూ. 97 వేలు పోగొట్టుకున్నాడు. అయితే.. సదరు వ్యక్తికి అసలు నాగరాజు నెంబర్‌ ఎలా వెళ్లిందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Also Read: ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో టెన్షన్‌ వాతావరణం.. రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించే అవకాశం.. అప్రమత్తమైన పోలీసులు..

Amit Shah: మావోయిస్టులకు అమిత్ షా వార్నింగ్.. గాయపడిన జవాన్లను పరామర్శించిన హోంమంత్రి

Cobra Battalion Jawan Safe: గల్లంతైన కోబ్రా జవాన్‌ మా వద్దే ఉన్నాడు.. క్లారిటీ ఇచ్చిన మావోయిస్టులు..