Kidnap: హైదరాబాద్‌లో కలకలం.. ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి కిడ్నాప్..
Girl kidnapping: హైదరాబాద్‌లో తొమ్మిదేళ్ల ఏళ్ల బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఇంటిముందు ఆడుకుంటున్న బాలికకు ఓ వ్యక్తి కేక్ ఇప్పించి
Girl kidnapping: హైదరాబాద్‌లో తొమ్మిదేళ్ల ఏళ్ల బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఇంటిముందు ఆడుకుంటున్న బాలికకు ఓ వ్యక్తి కేక్ ఇప్పించి అపహరించాడు. ఈ సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం జరిగింది. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఆర్.కె. నగర్, తట్టిఅన్నారంలో సోమవారం మధ్యాహ్నం తొమ్మిదేళ్ల ముస్కాన్ కనిపించకుండా పోయింది. దీంతో బాలిక తండ్రి ముస్తఫా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఆర్‌కేనగర్‌లో ఎస్.కె.ఫరీద్ దంపతులు పిల్లలతో కలిసి నివాసముంటున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం.
అయితే.. అదే కాలనీకి చెందిన బర్నబాస్ అనే వ్యక్తి చిత్తు కాగితాలు ఏరుకొని జీవనం సాగిస్తుంటాడు. ముస్తాఫా దంపతులు పనులకు వెళ్లిన సమయంలో ఇంటి వద్ద.. రెండో కూతురు ముస్కాన్ ఆడుకుంటోంది. ఈ క్రమంలో బర్నబాస్ కేకు ఇప్పించి అపహరించాడు. సాయంత్రం వచ్చేసరికి ఇంటి వద్ద కూతురు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వారు వెంటనే కాలనీవాసులతో కలిసి చుట్టుపక్కల వెతికినా.. ఎంతకీ ఆచూకీ లభించలేదు.
దీంతో బాలిక తండ్రి ముస్తఫా వెంటనే హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు 30 మంది పోలీసు బృందంతో తీవ్రంగా గాలిస్తున్నారు. బాలిక కిడ్నాప్ అయినట్టుగా అనుమానిస్తున్న ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించగా.. బర్నబాస్ బాలికను ఎత్తికెళ్లినట్లు గుర్తించారు. దీంతో అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read: