AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cobra Battalion Jawan Safe: గల్లంతైన కోబ్రా జవాన్‌ మా వద్దే ఉన్నాడు.. క్లారిటీ ఇచ్చిన మావోయిస్టులు..

Jawan Safe: కేంద్ర ప్రభుత్వంను డిమాండ్ చేస్తూ మావోయిస్టులు ఓ లేఖ రాశారు. రాకేశ్వర్ సింగ్ తమ ఆధీనంలోనే ఉన్నాడని మావోయిస్టుల విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను పెట్టారు.

Cobra Battalion Jawan Safe: గల్లంతైన కోబ్రా జవాన్‌ మా వద్దే ఉన్నాడు.. క్లారిటీ ఇచ్చిన మావోయిస్టులు..
Crpf Jawan Rakeshwar Safe
Sanjay Kasula
|

Updated on: Apr 05, 2021 | 5:22 PM

Share

కేంద్ర ప్రభుత్వంను డిమాండ్ చేస్తూ మావోయిస్టులు ఓ లేఖ రాశారు. రాకేశ్వర్ సింగ్ తమ ఆధీనంలోనే ఉన్నాడని మావోయిస్టుల విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను పెట్టారు. ఆపరేషన్ ప్రహార్-3ని తక్షణమే నిలిపివేయాలని లేఖలో డిమాండ్ చేశారు. అంతే కాదు ఏప్రిల్ 26న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌ తరువాత గల్లంతైన కోబ్రా జవాన్‌ రాకేశ్వర్‌సింగ్‌ తమ ఆధీనం లోనే ఉన్నాడని మావోయిస్టులు ప్రకటించారు. రాకేశ్వర్‌సింగ్‌కు ఎలాంటి హానీ చేయమని తెలిపారు మావోయిస్టులు. మరోవైపు రాకేశ్వర్‌సింగ్‌ను విడుదల చేయించాలని ఆయన కుటుంబసభ్యులు హోమంత్రిని వేడుకుంటున్నారు.

చత్తీస్‌ఘడ్‌ లోని బీజాపూర్‌-సుక్మా సరిహద్దులో నరమేథం సృష్టించారు మావోలు. పచ్చని దండకారణ్యంలో రక్తం ఏరులై పారింది. మావోలు పన్నిన ఉచ్చులో..పద్మవ్యూహంలో అభిమన్యుడిలా చిక్కుకుపోయారు జవాన్లు. ఒక్కసారిగా యూ ఆకారంలో మూడు వైపుల నుంచి చుట్టుముట్టిన మావోలు..జవాన్లపైకి బుల్లెట్ల వర్షం కురిపించారు. ఊహించని మావోల దాడితో భద్రతాదళాలు అప్రమత్తమై ఎదురుదాడికి దిగినా..అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 24 మంది జవాన్లు వీరమరణం పొందారు. కోబ్రా యూనిట్‌కు చెందిన రాకేశ్వర్‌సింగ్‌ను బందీగా పట్టుకున్నారు మావోయిస్టులు.

దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరులైన జవాన్ల మృతదేహాలకు..బీజాపూర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో అధికార లాంఛనాలతో ఘనంగా నివాళులు అర్పించారు. వీర జవాన్ల డెడ్‌బాడీస్‌ను ప్రత్యేక అంబులెన్సుల్లో స్వస్థలాలకు తరలించారు..తమ వారి చివరి చూపుల కోసం అక్కడికి చేరుకున్న అమరుల కుటుంబసభ్యుల రోదనలతో మిన్నంటింది ఆ ప్రాంతం.

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌. అమర జవాన్ల కుటుంబాలకు దేశం అండగా ఉంటుందన్నారు. జవాన్ల త్యాగాలు వృధా కాబోవన్నారు. ఈ దుశ్ఛర్యకు పాల్పడిన మావోయిస్ట్‌లను వదిలిపెట్టేదే లేదని వార్నింగ్‌ ఇచ్చారు హోం మంత్రి అమిత్‌ షా.

ఇవి కూడా చదవండి : Tirupati by-election: సింబల్‌ విషయంలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధికి ఊహించని షాక్..! అసలు ఏం జరిగింది 

Why Fan Have Three Blades: మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా..! ఫ్యాన్‌కు మూడు రెక్కలే ఎందుకుంటాయో తెలుసా..!

ఇవి కూడా చదవండి : మీ ఇంట్లో బల్లి ఉందా..! బల్లిని చూస్తే భయపడుతున్నారా..! బయటకు పంపించే సులభమైన మార్గం ఇదే..!