Earthquake today: ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న వరుస భూకంపాలు.. బెంగాల్, అస్సాంలో మళ్లీ ప్రకంపనలు..
Today Earthquake in India: ఉత్తరాదితోపాటు.. ఈశాన్య రాష్ట్రాల్లో సంభవిస్తున్న వరుస భూకంపాలు ప్రజలను భయభ్రాంతలుకు గురిచేస్తున్నాయి. సిక్కిం-నేపాల్
Today Earthquake in India: ఉత్తరాదితోపాటు.. ఈశాన్య రాష్ట్రాల్లో సంభవిస్తున్న వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. సిక్కిం-నేపాల్ సరిహద్దు సహా అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో సోమవారం రాత్రి భూమి కంపించిన విషయం తెలిసిందే. దీంతోపాటు అస్సాంలో మళ్లీ మంగళవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో.. పశ్చిమ బెంగాల్‌లో ఉదయం 7గంటల సమయంలో ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది.
అస్సాం రాష్ట్రంలోని తిన్ సుకియా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3.42 గంటలకు భూమి కంపించిందని.. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 2.7గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ పేర్కొంది. తెల్లవారుజామున భూ ప్రకంపనలు సంభవించడంతో.. నిద్రపోతున్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయాందోళనలతో పరుగులు తీశారు. కాగా.. పశ్చిమ బెంగాల్‌లో ఉదయం 7.07 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. సిలిగురికి తూర్పున 64 కిలోమీటర్ల దూరంలో.. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. దీని తీవ్రత 4.1గా నమోదైంది.
కాగా 12 గంటల వ్యవధిలోనే రెండుసార్లు ప్రకంపనలు సంభవించడంతో ఆయా రాష్ట్రాల విపత్తు శాఖలు అప్రమత్తమయ్యాయి. తరచూ భూమి కంపిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. తాజాగా సంభవించిన భూకంపంపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం అధికారులతో సమీక్షించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. కాగా.. సోమవారం రాత్రి 8:49 సమయంలో సిక్కిం-నేపాల్ సరిహద్దు సహా అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంపం తీవ్రత 5.4 గా నమోదైంది. అయితే.. భూప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: