Amit Shah: మావోయిస్టులకు అమిత్ షా వార్నింగ్.. గాయపడిన జవాన్లను పరామర్శించిన హోంమంత్రి

Chhattisgarh Naxal Attack: నక్సలిజంపై పోరు తీవ్రతరం అవుతుందని.. లొంగిపోయేవారిని స్వాగతిస్తామని.. చేతిలో ఆయుధాలుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హోమంత్రి అమిత్‌షా హెచ్చరించారు. నక్సలిజంపై

Amit Shah: మావోయిస్టులకు అమిత్ షా వార్నింగ్.. గాయపడిన జవాన్లను పరామర్శించిన హోంమంత్రి
Amit Shah Meets Soldiers
Follow us

|

Updated on: Apr 05, 2021 | 8:13 PM

Chhattisgarh Naxal Attack: నక్సలిజంపై పోరు తీవ్రతరం అవుతుందని.. లొంగిపోయేవారిని స్వాగతిస్తామని.. చేతిలో ఆయుధాలుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హోమంత్రి అమిత్‌షా హెచ్చరించారు. నక్సలిజంపై పోరు ఏమాత్రం బలహీనం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలతో జవాన్ల ఆత్మస్థైర్యం ఏమాత్రం తగ్గలేదని.. జవాన్లతో భారత ప్రభుత్వం, ఛత్తీస్‌గడ్‌ ప్రభుత్వం ఉందని అమిత్ షా పేర్కొన్నారు. న‌క్సల్స్ దాడిలో అమ‌రులైన జ‌వాన్లకు హోంమంత్రి అమిత్ షా, ఛ‌త్తీస్‌గ‌ఢ్ సీఎం భూపేష్ భాగేల్ నివాళులర్పించిన అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత బీజాపూర్ జిల్లాలోని బస్గుడా శిబిరంలో అమిత్‌ షా, సీఎం బూపేష్‌ బాగేల్‌ సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని కలిసి మాట్లాడారు. నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించారు.

ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. మన జవాన్లు ధైర్యంతో పోరాడారన్నారు. అమరవీరుల త్యాగం తప్పక ఫలిస్తుందన్నారు. జవాన్ల కష్టసుఖాల్లో తోడుంటామని.. భారత ప్రభుత్వం, ఛత్తీస్‌గడ్‌ ప్రభుత్వం వదిలిపెట్టదని పేర్కొన్నారు. నక్సల్స్‌తో జరుగుతున్న పోరాటాన్ని ముగింపు దశకు చేరుస్తామని వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నక్సలిజాన్ని కూకటి వేళ్లతో పెకిలించేంత వరకూ నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లు కొనసాగిస్తామని స్పష్టంచేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆర్మీ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు.

కాగా.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులో జవాన్లపై మావోయిస్టుల మెరుపుదాడి పాల్పడి 24 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. 31 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు. మూడు వైపుల నుంచి మావోయిస్టులు ఒక్కసారిగా జవాన్లపై దాడిచేయడంతో పెద్దసంఖ్యలో ప్రాణనష్టం జరిగింది.

మాట్లాడుతున్న అమిత్ షా..

Also Read:

‘ మా నాన్నను వదిలేయండి’.. కంటతడి పెట్టుకున్న జవాను రాకేశ్వర్ సింగ్ కుమార్తె.. కదిలిస్తున్న వీడియో