‘ మా నాన్నను వదిలేయండి’.. కంటతడి పెట్టుకున్న జవాను రాకేశ్వర్ సింగ్ కుమార్తె.. కదిలిస్తున్న వీడియో

జమ్మూ కాశ్మీర్‌కు చెందిన కోబ్రా బెటాలియన్‌కు చెందిన రాజేశ్వర్ సింగ్ ఛత్తీస్‌గ‌డ్‌లోని బీజాపూర్‌లో జరిగిన నక్సల్ దాడి తర్వాత కనిపించకుండా పోయారు.

' మా నాన్నను వదిలేయండి'.. కంటతడి పెట్టుకున్న జవాను రాకేశ్వర్ సింగ్ కుమార్తె.. కదిలిస్తున్న వీడియో
Cobra Commando Missing

Chhattisgarh naxal attack: జమ్మూ కాశ్మీర్‌కు చెందిన కోబ్రా బెటాలియన్‌కు చెందిన రాకేశ్వర్ సింగ్ ఛత్తీస్‌గ‌డ్‌లోని బీజాపూర్‌లో జరిగిన నక్సల్ దాడి తర్వాత కనిపించకుండా పోయారు. సమాచారం ప్రకారం, అతను నక్సలైట్ల ఆధీనంలో ఉన్నాడు.నక్సలైట్లు జవాన్ విడుదల కోసం కొన్ని షరతులు పెట్టారు. ఈ వార్తల నేపథ్యంలో, తప్పిపోయిన జవాన్ కుటుంబంలో దు:ఖం నెలకుంది. తన భర్తను వీలైనంత త్వరగా రక్షించాలని జవాన్ భార్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో రాకేశ్వర్ సింగ్ కుమార్తెకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. “మా మాన్నను వదిలేయండి” అని ఆ పాప అడుగుతున్న తీరు నెటిజన్లను కంటతడి పెట్టిస్తుంది. ఆ వీడియోలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా దు:ఖిస్తున్న తీరు మనసులను కలిచివేస్తుంది.  ఆపరేషన్‌కు వెళ్లే ముందు శుక్రవారం చివరిసారిగా తమతో మాట్లాడినట్లు జవాన్ కుటుంబం తెలిపింది.

‘శుక్రవారం మాతో ఫోన్‌లో మాట్లాడారు.  నేను శనివారం మాట్లాడుతానని అని చెప్పారు. అప్పటి నుంచి మా కుటుంబ సభ్యులతో ఎటువంటి కాంటాక్ట్ లేదు.  శనివారం రాత్రి నుంచి మేము నిరంతరం ఫోన్ చేస్తున్నాం.  అతని ఫోన్ రింగ్ అవుతోంది, కాని  కాల్ లిఫ్ట్ చెయ్యడం లేదు. తర్వాత విషయం తెలిసింది ‘ అని జవాన్ భార్య  తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లో నిజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది జవాన్లు అమరులయ్యారు. మరో 31 మంది గాయపడ్డారు.  ఒక జవాన్ కనిపించకుండాపోయారు. మిస్సైన జవాన్ రాకేశ్వర్ సింగ్ తమ ఆధీనంలో ఉన్నట్లు నక్సలైట్లు లేఖ విడుదల చేశారు. రాకేశ్వర్ సింగ్ తమ ఆధీనంలోనే ఉన్నాడని మావోయిస్టుల విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను పెట్టారు. ఆపరేషన్ ప్రహార్-3ని తక్షణమే నిలిపివేయాలని లేఖలో డిమాండ్ చేశారు. అంతే కాదు ఏప్రిల్ 26న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌ తరువాత గల్లంతైన కోబ్రా జవాన్‌ రాకేశ్వర్‌సింగ్‌ తమ ఆధీనం లోనే ఉన్నాడని మావోయిస్టులు ప్రకటించారు. రాకేశ్వర్‌సింగ్‌కు ఎలాంటి హానీ చేయమని పేర్కొన్నారు. మరోవైపు రాకేశ్వర్‌సింగ్‌ను విడుదల చేయించాలని ఆయన కుటుంబసభ్యులు హోమంత్రిని వేడుకుంటున్నారు.

Also Read: ఏపీలో కరోనా ఉగ్రరూపం.. కొత్తగా 1,326 పాజిటివ్ కేసులు.. ప్రమాదకరంగా మరణాలు..

వరుడి ఎత్తు రెండు అడుగులు.. వధువు ఎత్తు నాలుగు అడుగులు.. దేవుడే కలిపాడు ఈ జంటను..