Covid-19 Vaccine: వేగవంతంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ.. ఇప్పటివరకు 8 కోట్ల డోసులు పంపిణీ

India Corona Vaccination Updates: భారత్‌లో కరోనావైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో ఎన్నడూలేని విధంగా కేసుల సంఖ్య లక్ష మార్క్ దాటింది. ఓ వైపు కేసుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు కరోనా

Covid-19 Vaccine: వేగవంతంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ.. ఇప్పటివరకు 8 కోట్ల డోసులు పంపిణీ
Covid Vaccination
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 05, 2021 | 7:02 PM

India Corona Vaccination Updates: భారత్‌లో కరోనావైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో ఎన్నడూలేని విధంగా కేసుల సంఖ్య లక్ష మార్క్ దాటింది. ఓ వైపు కేసుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ పరంగా భారత్ ప్రపంచంలోనే ముందు వరుసలో దూసుకుపోతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. కోవిడ్ వ్యాక్సినేషన్ పరంగా భారత్ మరో మైలు రాయిని అధిగమించిందంటూ కేంద్రం సాయంత్రం ట్విట్ చేసింది. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టిన 80వ రోజు భారత్ ఈ రికార్డును అధిగమించింది.

కాగా.. దేశంలో జనవరి 16 నుంచి కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి టీకాను అందించారు. అనంతరం మార్చి 1నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీనిలో భాగంగా 60ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించారు. అనంతరం ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. అయితే ఈ వ్యాక్సినేషన్ భాగంగా నిత్యం 20 లక్షల మందికి డోసులను పంపిణీ చేస్తున్నారు.

కాగా.. ఆదివారం (24 గంటల్లో) దేశంలో 1,03,558 పాజిటివ్ కేసులు, 478 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,25,89,067 కరోనా కేసులు నమోదు కాగా.. 1,65,101 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. యూఎస్ తర్వాత దేశంలో ఒక్క రోజులో లక్ష కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 7,41,830 యాక్టివ్ కేసులున్నాయి.

Also Read:

Eek Strain virus: జపాన్‌లో కరోనా ఫోర్త్‌ వేవ్‌.. అలజడి సృష్టిస్తున్న కొత్త రకం వైరస్‌ ‘ఈక్‌’..

Indonesia Floods: ఇండోనేషియాను వణికిస్తున్న వరదలు.. 87కి పెరిగిన మృతుల సంఖ్య..