Eek Strain virus: జపాన్‌లో కరోనా ఫోర్త్‌ వేవ్‌.. అలజడి సృష్టిస్తున్న కొత్త రకం వైరస్‌ ‘ఈక్‌’..

New coronavirus variant: జపాన్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. మరో మూడున్నర నెలల్లో ఒలింపిక్స్‌ మొదలుకానున్న తరుణంలో కరోనా నాలుగో వేవ్‌ అలజడి సృష్టిస్తోంది. నిరంతరం పెరుగుతున్న కేసులతో

Eek Strain virus: జపాన్‌లో కరోనా ఫోర్త్‌ వేవ్‌.. అలజడి సృష్టిస్తున్న కొత్త రకం వైరస్‌ ‘ఈక్‌’..
Strain Virus Eek
Follow us

|

Updated on: Apr 05, 2021 | 4:02 PM

New coronavirus variant: జపాన్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. మరో మూడున్నర నెలల్లో ఒలింపిక్స్‌ మొదలుకానున్న తరుణంలో కరోనా నాలుగో వేవ్‌ అలజడి సృష్టిస్తోంది. నిరంతరం పెరుగుతున్న కేసులతో అల్లాడుతున్న తరుణంలోనే.. కొత్తరకం వైరస్‌ వేరియంట్లు భయపడుతున్నాయి. నిత్యం జపాన్‌లో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు ఎప్పటికప్పుడు కొత్త మ్యుటేషన్లు వెలుగులోకి వస్తుండటంతో కలవరం మొదలైంది.

ఈ నేపథ్యంలో జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో బ్రిటన్‌ వేరియంట్‌ కేసులు అధికంగా నమోదు అవుతుండడం పట్ల నిపుణులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. ఒసాకా నగరంలో ఈ వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘ఈక్‌’ (EEK – E484K) మ్యుటేషన్‌ వెలుగులోకి వచ్చింది. టోక్యో నగరంతోపాటు మరికొన్ని చోట్ల ఈక్‌ మ్యుటేషన్‌ విస్తరిస్తోంది. అయితే.. టోక్యోలో వెలుగులోకి వస్తున్న కరోనా కేసుల్లో 70 శాతం కేసుల్లో ఈక్‌ వేరియంట్‌ నిర్థారణ అయినట్లు జపాన్‌ అధికారులు తెలిపారు. అయితే ఈ మ్యుటేషన్‌ వ్యాక్సిన్‌ సామర్ధ్యాన్ని కూడా తగ్గించేస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. టోక్యో మెడికల్ అండ్ డెంటల్ యూనివర్శిటీ ఆసుపత్రిలో మార్చిలో ఈక్‌ న్యూస్ట్రేయిన్‌ను కనుగొన్నారు. 14 మంది కోవిడ్ -19 రోగులలో 10 మందిలో E484K మ్యుటేషన్ ఉన్నట్లు గుర్తించారు. అప్పటినుంచి ఈ కొత్తరకం కేసులు భారీగా పెరుగుతున్నాయి.

Also Read:

Indonesia Floods: ఇండోనేషియాను వణికిస్తున్న వరదలు.. 87కి పెరిగిన మృతుల సంఖ్య..

Heartbreaking Picture: ఊరికాని ఊరిలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం.. లంచ్‌గా అన్నంలో నీరు..ఉల్లిపాయ.. హార్ట్‌టచింగ్‌ స్టోరీ!