Andhrapradesh: వరుడి ఎత్తు రెండు అడుగులు.. వధువు ఎత్తు నాలుగు అడుగులు.. దేవుడే కలిపాడు ఈ జంటను..
ప్రతి వ్యక్తి పరిపూర్ణ జీవిత భాగస్వామిని కోరుకుంటాడు. అందం అర్థం మనసే అని అందరూ చెబుతున్నప్పటికీ, ఇంకా ఎత్తు, రంగు వంటి వాటిపై చాలామంది ఆకర్షణ...
ప్రతి వ్యక్తి పరిపూర్ణ జీవిత భాగస్వామిని కోరుకుంటాడు. అందం అర్థం మనసే అని అందరూ చెబుతున్నప్పటికీ, ఇంకా ఎత్తు, రంగు వంటి వాటిపై చాలామంది ఆకర్షణ కలిగి ఉంటున్నారన్నది వాస్తవం. కానీ ఏపీలో జరిగిన ఒక ప్రత్యేకమైన వివాహం పలువురికి ఆదర్శంగా నిలిచింది. ఈ పెళ్లి యొక్క ప్రత్యేకత ఏమిటంటే వరుడు ఎత్తు రెండు అడుగులు. వధువు ఎత్తు నాలుగు అడుగులు. వారిద్దరూ తాజాగా దాంపత్యం జీవితంలోకి అడుగుపెట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముమ్మిడివరం స్థానిక చర్చిలో ఈ ఆదర్శ వివాహం జరిగింది. వరుడు దేవరపల్లి శ్రీనివాస్ ఎత్తు తన బాల్యంలోనే పెరగడం ఆగిపోయింది. శ్రీనివాస్ ఎత్తు కేవలం రెండు అడుగులు మాత్రమే. దీనివల్ల అతడి తల్లిదండ్రులు, బంధువులు ఎలా పెళ్లి అవుతుందో అని భయపడ్డారు. శ్రీనివాస్ గ్రాడ్యుయేషన్ తరువాత, కుటుంబ సభ్యులు అతడి కోసం వధువు కోసం వెతకడం ప్రారంభించారు. సమనస గ్రామంలో నివసించే సత్య దుర్గను శ్రీనివాస్‌కు సరైన జోడిగా భావించారు. సత్య దుర్గ ఎత్తు కూడా నాలుగు అడుగులు మాత్రమే. సత్య దుర్గ ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు. మార్చి 31 న శాంతినగర్‌లో శ్రీనివాస్‌తో ఆమె వివాహం పెద్దల సమక్షంలో జరిగింది.
వధూవరులు ఇద్దరూ క్రైస్తవ సమాజానికి చెందినవారు. వారి కుటుంబాలు ఈ వేడుకతో ఆనందంలో ఉన్నాయి. ఈ వివాహాన్ని ఆత్రుతగా, ఉత్సాహంగా చూడటానికి పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి వచ్చారు. గ్రామంలోని పెద్దలతో సహా కుటుంబ సభ్యులు ఈ ప్రత్యేకమైన జంటను ఆశీర్వదించారు. వారికి సంతోషకరమైన భవిష్యత్తును భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు.
Also Read: ఈము పక్షులు, సైనికుల మధ్య వార్.. ఈ భీకర యుద్ధంలో ఎవరు గెలిచారో తెలుసా..?
ఏపీలో కరోనా ఉగ్రరూపం.. కొత్తగా 1,326 పాజిటివ్ కేసులు.. ప్రమాదకరంగా మరణాలు..