Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Emus vs. Humans: ఈము పక్షులు, సైనికుల మధ్య వార్.. ఈ భీకర యుద్ధంలో ఎవరు గెలిచారో తెలుసా..?

మీరు యుద్ధాల గురించి చాలా కథలు చాలా విని ఉంటారు. స్వాతంత్య్రం కోసం, స్వాభిమానం కోసం, రాజ్యం కోసం.. ఇలా అనేక యుద్దాలు చరిత్ర పుటలలో లిఖించబడ్డాయి.

Emus vs. Humans: ఈము పక్షులు, సైనికుల మధ్య వార్.. ఈ భీకర యుద్ధంలో ఎవరు గెలిచారో తెలుసా..?
Emus Vs. Humans
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 05, 2021 | 5:40 PM

మీరు యుద్ధాల గురించి చాలా కథలు చాలా విని ఉంటారు. స్వాతంత్య్రం కోసం, స్వాభిమానం కోసం, రాజ్యం కోసం.. ఇలా అనేక యుద్దాలు చరిత్ర పుటలలో లిఖించబడ్డాయి. అయితే పక్షులు, సైనికుల మధ్య జరిగిన యుద్దం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. ఇప్పుడు మీకు అలాంటి విచిత్ర యుద్దం గురించి చెప్పబోతున్నాం.

ఈ ఆసక్తికరమైన సంఘటన తెలుసుకోవాలంటే, మీరు 1932 లో జరిగిన కొన్ని పరిణామాలు కూడా తెలుసుకోవాలి. వాస్తవానికి, మొదటి ప్రపంచ యుద్ధం తరువాత రిటైర్డ్ సైనికులకు పునరావాసం కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం భూమి ఇచ్చింది. పదవీ విరమణ తరువాత ఇక్కడి జవాన్లు రైతులుగా మారారు.  ప్రభుత్వం నుండి పొందిన భూములను సాగు చేయడం ప్రారంభించారు.

ఈము పక్షులు రైతులను వేధించడం ప్రారంభించాయి..

అయితే సాగుకు పూనుకున్న రిటైర్డ్ సైనికులకు అడవి పక్షి ఈము రూపంలో పెద్ద చిక్కొచ్చిపడింది. అవి మూకుమ్మడిగా పంటలను నాశనం చేయడం ప్రారంభించాయి. ఈ కారణంగా, రైతులుగా మారిన సైనికులు భారీ నష్టాలను చవిచూశారు. వాటి బారి నుంచి పంటలను కాపాడుకోవడానికి, పొలాల చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. కాని ఈ  అడవి పక్షి సమూహం అన్ని ఫెన్సింగ్లను ధ్వంసం చేసింది.  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ పక్షులు ఒకటి లేదా రెండు లేదా వంద లేదా రెండు వందలు కాదు..  సుమారు 20 వేలు ఆ ప్రాంతంలో తిష్ట వేశాయి.

దీంతో ఏం చేయాలో పాలుపోక  రైతులుగా మారిన మాజీ సైనికుల బృందం వారి సమస్యను ప్రభుత్వానికి విన్నవించింది. ఈ సమస్య  తీవ్రతను అర్థం చేసుకున్న ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రైతులకు సహాయం చేయడానికి, వారి పంటను కాపాడటానికి మెషిన్ గన్లతో కూడిన ఆర్మీని అక్కడికి పంపారు. నవంబర్ 2, 1932 న, ప్రభుత్వం పంపిన సైన్యం ఈము పక్షి మందను తరిమికొట్టడానికి కార్యకలాపాలను ప్రారంభించింది. నవంబర్ 4, 1932 న, సైనికులు సుమారు 1000 ఈముల మందను చూసి.. వాటిపై కాల్పులు జరిపారు. ఫైనల్‌గా కాల్పుల్లో చనిపోయిన ఈము పక్షులను లెక్కగడితే కేవలం 12గా తేలాయి.

ఈము  పక్షులు తమను తాము రక్షించుకోవడానికి ప్రత్యేక పద్ధతులను అనుసరించాయి

ఈ సంఘటనతో ఈము పక్షులు మరింత అలెర్టయ్యాయి.  సైనికుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఈములు తమను చిన్న సమూహాలుగా విభజించుకున్నాయి.  రైతుల పంటలను నాశనం చేయడం.. సైనికులు చేయడానికి వచ్చినప్పుడు అక్కడి నుంచి పారిపోతూ పక్షులు తెలివితేటలు ప్రదర్శించాయి. ఈ యుద్ధంలో, సైనికులు ఈము పక్షులపై సుమారు 2500 రౌండ్లు కాల్పులు జరిపినట్లు అధికారులు చెప్పారు. కాని 20 వేల ఈములలో, వారు చంపింది కేవలం 50 మాత్రమే. ఈ వార్త ప్రపంచ మీడియాకు చేరుకున్న వెంటనే చర్చ ప్రారంభమైంది. ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభమయ్యాయి. చివరికి, ప్రభుత్వం సైన్యాన్ని అక్కడి నుంచి ఉపసంహరించుకుంది.

ఈ సంఘటనను ఆస్ట్రేలియా చరిత్రలో ‘ఈము వార్’ లేదా ‘గ్రేట్ ఈము వార్’ అని పిలుస్తారు. ఈ ఆపరేషన్ ఇన్‌ఛార్జి మేజర్ ముర్దిత్ మాట్లాడుతూ ఈము పక్షుల లాంటి స్ట్రాటజీ అమలు చేస్తే.. ప్రపంచంలోని ఏ సైన్యాన్ని అయినా తాము ఎదుర్కోగలమని చెప్పుకొచ్చాడు.

Also Read: ఆ దేవాలయంలో దేవుడికి నైవేద్యంగా లిక్కర్.. పూజ అనంతరం ఏం చేస్తారంటే..?

అశ్లీల చిత్రాల ఘటనలో మరో ముగ్గురు ఎస్వీబీసీ ఉద్యోగులపై వేటు.. ఇప్పటివరకు ఎంతమంది అంటే..?‌