బరువు తగ్గడం వలన టైప్ 2 డయాబెటిస్‌ను కంట్రోల్ చేయవచ్చు !! అందుకోసం ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరిని తీవ్రంగా వేధించే సమస్యలు రెండు. అవి.. అధిక బరువు, టైప్ 2 డయాబెటిస్. ఇక బరువు తగ్గడం కోసం అనేక
ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరిని తీవ్రంగా వేధించే సమస్యలు రెండు. అవి.. అధిక బరువు, టైప్ 2 డయాబెటిస్. ఇక బరువు తగ్గడం కోసం అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు చాలా మంది. అలాగే టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించడానికి విభిన్న రకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయితే ఈ బరువు తగ్గడం అనేది టైప్ 2 డయాబెటిస్ పై ప్రభావం చూపిస్తుందా ? అంటే.. నిజమే అనుకోవాలి. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం బరువు తగ్గడం వలన రక్తంలో షూగర్ లెవల్స్‌ను పెంచుతుంది. అలాగే ధమునులలో అధిక రక్తపోటు, ప్లేట్ లేట్స్ ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. 5 నుంచి 10శాతం బరువు తగ్గడం వలవ డయాబెటిస్ మందుల పరిమాణం కూడా తగ్గుతుందని తేలింది. టైప్ 2 డయాబెటిస్తో బాధపడే వారు బరువు తగ్గడమనేది చాలా ముఖ్యం. బరువు తగ్గడం వలన డయాబెటిస్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఇందుకోసం కోన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
* ఇన్సులిన్ రెసిస్టెన్స్..
టైప్ 2 డయాబెటిస్‌లో, ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌కు శరీరం ఎక్కువగా స్పందించదు. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. దీనిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇది ఎక్కువగా అధిక బరువుపై ఆధారపడి ఉంటుంది. బరువు తగ్గడం వలన శరీరం నుంచి ఇన్సులిన్‌కు మరింత సున్నితంగా మారుతుంది. అలాగే ఇన్సులిన్ నిరోధకతను కూడా తగ్గిస్తుంది. ఇన్సులిన్ నిరోధకత తగ్గడం వలన డయాబెటిస్ కంట్రోల్ చేయవచ్చు.
* A1C ఫలితాలు..
బరువు తగ్గడంలో ఇన్సులిన్ పెరుగుదల మెరుగుపడుతుంది. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, A1C పరీక్షలు గత రెండు నుంచి మూడు నెలల వరకు రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. అందుకే టైప్ 2 డయాబెటిస్ నియంత్రించడానికి ఆహారం, వ్యాయామం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
* రక్తపోటును తగ్గించడం, కొలెస్ట్రాల్ లెవల్స్ మెరుగుపరచడం..
సీడీసీ ప్రకారం టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్న వారిలో గుండె సమస్యలు, డయాబెటిస్ ముడిపడి ఉన్నాయి. అలాగే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలున్నాయి. అధిక రక్తపోటు ధమనులను దెబ్బతీస్తుంది. అలాగే ఎక్కువ ఎల్‌డిఎల్, ట్రైగ్లిజరైడ్ కలిగి ఉండటం వలన ధమనులు ఎక్కువగా దెబ్బతింటాయి. ఉబకాయం అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుకు ప్రమాద కారకాలు. కానీ… బరువు తగ్గడం వలన ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. 401 మంది వ్యక్తులకు జరిపిన అధ్యయనంలో, అధిక బరువు వారి శరీర బరువులో 5 నుంచి 10 శాతం కోల్పోయిన వ్యక్తులు వారి మొత్తం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా భారీగా తగ్గుతాయని తేలింది.
* పెరిగిన శక్తి, మెరుగైన మానసిక స్థితి..
బరువు తగ్గినప్పుడు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు.. వారి శక్తి స్థాయిలు పెరుగుతాయి. అలాగే వారి మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, బరువు తగ్గడం ఆత్మవిశ్వాసం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గిన తర్వాత చాలా మంది వారి శరీరంలో చాలా మార్పులు చూస్తారు. బరువు తగ్గడం వలన మధుమేహాన్ని నియంత్రించడానికి మరింత సహయపడుతుంది.
* స్లీప్ అప్నియా ప్రమాదాన్ని తగ్గిస్తుంది..
డయాబెటిస్ స్లీప్ అప్నియాతో బాధపడే విధంగా చేస్తుంది. స్లీప్ అప్నియా అనేది నిద్రలో అసాధారణమైన శ్వాసను అందించే రుగ్మత. డయాబెటిస్తో బాధపడుతున్న వారిలో 71 శాతం మందికి స్లీప్ అప్నియా అబ్స్ట్రక్టివ్. బరువు తగ్గడం స్లీప్ అప్నియాను మెరుగుపరుస్తుందని, అలాగే మంచి నిద్రను అందిస్తుందని అధ్యయనాల్లో తేలింది. బాగా నిద్రపోవడం వల్ల మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ఎందుకంటే తగినంత నిద్రపోకపోవడం వలన ఇన్సులిన్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.
గమనిక: ఈ విషయాలు కేవలం ఆరోగ్య నిపుణులు, అధ్యాయనాల ప్రకారం మాత్రమే అందించాం. ఈ వివరణ కేవలం అవగాహన కోసమే. ముఖ్యంగా మీ ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి చిన్న సమస్యకు ముందుగా వైద్యులను సంప్రదించి.. సలహాలు తీసుకోగలరు.
Also Read: వీకెండ్లో మీ చర్మాన్ని కాపాడుకోవడానికి ఈ ఐదు రకాల టిప్స్ ఫాలో అవ్వండి.. మెరిసే చర్మం మీ సొంతమే ఇక..