Hyderabad Realtor Murder: తవ్వేకొద్ది కదులుతున్న డొంక.. రియల్టర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు

రియల్టర్ భాస్కర్‌రెడ్డి మర్డర్ కేసులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కీలక సూత్రదారి త్రిలోక్‌నాథ్‌ గురూజీ కోసం వేట ముమ్మరం....

Hyderabad Realtor Murder: తవ్వేకొద్ది కదులుతున్న డొంక.. రియల్టర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు
మృతుడు విజయ్ భాస్కర్ రెడ్డి
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 08, 2021 | 12:00 PM

రియల్టర్ భాస్కర్‌రెడ్డి మర్డర్ కేసులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కీలక సూత్రదారి త్రిలోక్‌నాథ్‌ గురూజీ కోసం వేట ముమ్మరం చేశారు పోలీసులు. స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి మరీ వెతుకుతున్నారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ఏపీలో గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో మల్లేష్, సుధాకర్, కృష్ణంరాజు, RMP డాక్టర్ శ్రవణ్‌ అరెస్టయ్యారు. భాస్కర్‌రెడ్డికి మత్తు మందు టాబ్లెట్స్ కలిపిఇచ్చిన మల్లేష్ కుమారుడు కార్తిక్ పరారీలో ఉన్నాడు. ఈ మర్డర్‌కు దారితీసిన అసలు కారణాలు, ఇతర వ్యక్తుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

దర్యాప్తులో భాగంగా త్రిలోక్‌నాథ్ గురూజీపై ఫోకస్ చేసిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెల్లడయ్యాయి. అతడి గత చరిత్రనంతా తవ్వితీస్తున్నారు. గురూజీ ముసుగులో త్రిలోక్‌నాథ్ సాగించిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.. ఆయుర్వేద మందుల పేరుతో బాబాగా మారాడు త్రిలోక్. బాచుపల్లి హిల్‌టౌన్‌లో ఓ డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో ఆయుర్వేద హాస్పిటల్ కూడా ఏర్పాటు చేశాడు. ఇతడి బాధితుల్లో ప్రజాప్రతినిధులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో మాజీ ఎమ్మెల్సీ ఇంట్లో కూడా పూజలు చేశాడు. ఉండి మాజీ ఎమ్మెల్యే భూముల్లో ఇరీడియం నిలువలు ఉన్నాయని నమ్మించాడు త్రిలోక్. ఓ భక్తురాలిని కూడా మోసం చేశాడు. గతంలో గురూజీ త్రిలోక్‌పై… విజయ్ భాస్కర్ రెడ్డి ఈడీకి కూడా ఫిర్యాదు చేశారు.

నెల్లూరు జిల్లా కావలికి చెందిన విజయభాస్కర్ రెడ్డి హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటాడు. ఇతడికి గురూజీ త్రిలోక్ నాథ్ తో పరిచయం. ఇద్దరి మధ్య బిజినెస్ డీలింగ్స్ ఉండేవి. ఆర్థికలావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. విజయ్‌ని మర్డర్ చేయాలని నిర్ణయించిన త్రిలోక్.. తన శిష్యులైన మల్లేష్- సుధాకర్‌లను పురమాయించాడు.. ప్రత్యేక వెజ్ మంచూరియా తయారు చేయించి.. అందులో డాక్టర్ శ్రావణ్ ఇచ్చిన రెస్ట్ ఇన్ మత్తు మాత్రలు కలిపారు. ఆ మత్తులో ఉండగానే.. కారు ఎక్కించి శ్రీశైలం హైవే వైపు తీసుకెళ్లారు. దారి మధ్యలోనే విజయభాస్కరరెడ్డిపై దాడి చేయడంతో.. అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సున్నిపెంట స్మశానానికి వెళ్లి కరోనాతో చనపోయాడంటూ అంత్యక్రియలు చేశారు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు.. ఆ తర్వాత తీగ లాగితే డొంకంతా కదిలింది.

Also Read:  ప్రకాశం జిల్లాలో దడ పుట్టిస్తోన్న కరోనా కేసులు.. పలు మండలాల్లో ఆంక్షలు

 తూర్పు గోదావరి జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ టెర్రర్.. తాజాగా ఇద్దరు మృతి