Earthquake: తెలుగు రాష్ట్రాల్లో వరుసగా భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

Earthquake in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో వరుస భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్‌తోపాటు, తెలంగాణలో ఆదివారం ఉదయం

Earthquake: తెలుగు రాష్ట్రాల్లో వరుసగా భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
Earthquake
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 08, 2021 | 12:26 PM

Earthquake in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో వరుస భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్‌తోపాటు, తెలంగాణలో ఆదివారం ఉదయం వరుస భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఏపీలోని గుంటూరు, పులిచింత‌ల స‌మీపంలో ఈ ఉద‌యం 7.15 నుంచి 8.20 గంట‌ల మ‌ధ్య భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3, 2.7, 2.3 గా న‌మోదు అయినట్లు అదికారులు తెలిపారు. దీంతోపాటు సూర్యాపేట, చింత‌ల‌పాలెం, మేళ్ల చెరువు మండ‌లాల్లో భూ ప్రకంపనలు సంభ‌వించాయి. గ‌త వారం రోజులుగా పులిచితంల స‌మీపంలో భూమి కంపించిన‌ట్లు అధికారులు తెలుపుతున్నారు. కాగా భూకంపం సంభవించినట్లు ఎన్జీఆర్‌ఐ శాస్త్రవేత్త శ్రీనగేష్‌ సైతం ధ్రువీకరించారు.

కాగా.. ఏపీ, తెలంగాణలో భూకంపాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోయినప్పటకీ.. వరుస ప్రకంపనల వల్ల ఆందోళన వ్యక్తం అవుతోంది.

Also Read:

AP Crime: ఆ అనుమానంతో.. భార్యపై కత్తితో దాడి.. అనంతపురం జిల్లాలో దారుణం..

Wheatgrass: మలబద్ధకం, గర్భసంబంధం వ్యాధులతో బాధపడేవారికి దివ్యౌషధం ఈ రసం.. రోజు 4 గ్లాసులు తాగితే అద్భుత ఫలితం