మరీ ఇంత దారుణమా..! కులం పేరుతో అవమానం.. ఏకంగా ప్రభుత్వ ఉద్యోగినే

తమిళనాడులో కులం పేరుతో ప్రభుత్వ ఉద్యోగిని అవమానించారు అగ్రవర్ణాలకు చెందిన వారు. కోయంబత్తూర్‌లోని అన్నూర్‌...

మరీ ఇంత దారుణమా..! కులం పేరుతో అవమానం.. ఏకంగా ప్రభుత్వ ఉద్యోగినే
Caste Abuse
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 08, 2021 | 1:01 PM

తమిళనాడులో కులం పేరుతో ప్రభుత్వ ఉద్యోగిని అవమానించారు అగ్రవర్ణాలకు చెందిన వారు. కోయంబత్తూర్‌లోని అన్నూర్‌ పంచాయితీలో ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తున్న ముత్తుస్వామిని.. కాళ్లమీద పడి క్షమాపణ చెప్పాలంటూ బెదిరింపులకు దిగారు. తన భూముల వివరాల కోసం పంచాయతీకి వెళ్లిన గోపాలస్వామి అనే వ్యక్తి.. అక్కడ మహిళా ఉద్యోగితో దురుసుగా మాట్లాడాడు. ఈ వ్యవహారంలో ముత్తుస్వామి, గోపాలస్వామి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ముత్తుస్వామి దళితుడని కులం పేరుతో అవమానించాడు గోపాలస్వామి. తన కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పకపోతే తన పలుకుబడితో ఉద్యోగం తీసేయిస్తానని బెదిరించాడు. దీంతో అతని కాళ్ళమీద పడి క్షమాపణ చెప్పాడు ముత్తుస్వామి. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్‌..విచారణకు ఆదేశించారు.

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం అన్నబోయినపల్లిలో దారుణం జరిగింది. నర్సింహా అనే వ్యక్తి.. అతని భార్య రమణమ్మ(45‌)ను గొంతుకోసి చంపాడు. అనంతరం పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.  భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు పోలీసుల వెల్లడించారు.

Also Read:  తవ్వేకొద్ది కదులుతున్న డొంక.. రియల్టర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు

 ప్రకాశం జిల్లాలో దడ పుట్టిస్తోన్న కరోనా కేసులు.. పలు మండలాల్లో ఆంక్షలు