CBI: సోషల్ మీడియాలో న్యాయమూర్తులను కించపరిచిన కేసులో మరో ఇద్దరి అరెస్ట్.. ఇప్పటివరకూ 5 గురిని అరెస్ట్ చేసిన సీబీఐ!

సోషల్ మీడియాలో న్యాయమూర్తులు..న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా పోస్ట్ లు చేస్తున్నారన్న ఆరోపణపై మరో ఇద్దరినీ సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరి అరెస్ట్ తో ఇప్పటివరకూ ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఐదుకు చేరింది.

CBI: సోషల్ మీడియాలో న్యాయమూర్తులను కించపరిచిన కేసులో మరో ఇద్దరి అరెస్ట్.. ఇప్పటివరకూ 5 గురిని అరెస్ట్ చేసిన సీబీఐ!
Cbi
Follow us
KVD Varma

|

Updated on: Aug 08, 2021 | 2:49 PM

CBI: సోషల్ మీడియాలో న్యాయమూర్తులు..న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా పోస్ట్ లు చేస్తున్నారన్న ఆరోపణపై మరో ఇద్దరినీ సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరి అరెస్ట్ తో ఇప్పటివరకూ ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఐదుకు చేరింది. తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ దిగువ కోర్టు న్యాయమూర్తులు ఫిర్యాదు చేయగా దీనిపై విచారణ చేస్తున్న  సీబీఐ ఈ అరెస్ట్ లు చేసింది. ప్రస్తుతం అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు కాంపిటెంట్ కోర్టు ముందు హాజరుపరచనున్నారు.

తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ దిగువ కోర్టు న్యాయమూర్తులు ఫిర్యాదు చేసిన తరువాత, కేసు నమోదు చేసిన సీబీఐ, ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న 16 మంది నిందితుల్లో 13 మందిని వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో గుర్తించింది. వారిలో ముగ్గురు విదేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. సీబీఐ ఇప్పటివరకు 13 మందిలో 11 మందిని విచారించి, వారిలో మొత్తం ఐదుగురిని అరెస్టు చేసింది. మిగిలిన 6 గురు నిందితులపై ఆధారాలను పరిశీలిస్తున్నారు. విదేశాల్లో ఉన్న మరో ఇద్దరు నిందితులను సీబీఐ విచారించడానికి ప్రయత్నిస్తోంది.

సిబిఐ 16 మంది నిందితులపై 11.11.2020 న కేసు నమోదు చేసింది.  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  రిజిస్ట్రార్ జనరల్ నుండి వచ్చిన ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపిసి సెక్షన్ 153 (ఎ), 504, 505 (2), 506, ఐటి చట్టం, 2000 సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు.  నిందితుడు, ఉద్దేశపూర్వకంగా న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని, గౌరవనీయులైన న్యాయమూర్తులు మరియు న్యాయవ్యవస్థలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అవమానకరమైన పోస్ట్‌లు చేశారని ఆరోపణలు నమోదు అయ్యాయి.

ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో న్యాయమూర్తుల ఫిర్యాదులపై స్పందించవని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జార్ఖండ్‌ జిల్లా జడ్జి హత్య కేసు విచారణ సందర్భంగా ఎన్‌వి రమణ మాట్లాడుతూ ‘ సిబిఐ ఏం చేయట్లేదు. సిబిఐ వైఖరిలో మార్పు ఆశించాం. కానీ అటువంటి పరిస్థితి లేదు. ఇది చెప్పేందుకు చింతిస్తున్నా’ అంటూ న్యాయమూర్తుల రక్షణకు సంబంధించిన పిటిషన్‌పై వారం రోజుల్లోగా స్పందించాలని కేంద్రాన్ని కోరారు. తాను బాధ్యతాయుతంగా ఈ వ్యాఖ్యలు చేశానని అన్నారు.

ఇక ఈ కేసులో ఇప్పటివరకూ మొత్తం ఐదుగురు నిందితులను సీబీఐ అరెస్ట్ చేసింది. తాజాగా పట్టపు ఆదర్శ్, లవనూరు సాంబశివ రెడ్డి అనే ఇద్దరినీ అరెస్ట్ చేసిన సీబీఐ గత నెల 27 వతేదీన ధమి రెడ్డి కొండా రెడ్డి, పాముల సుధీర్ లను అరెస్ట్ చేసింది. వీరిలో కొండారెడ్డి ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. సుధీర్ ఈనెల 10వ తేదీ వరకు పోలీస్ కస్టడీలో ఉంటారు. అదేవిధంగా అదే నెలలో 9 వ తేదీన అరెస్ట్ చేసిన లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి న్యాయ సంరక్షణలో ఉన్నారని సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

Also Read: Terror Funding Case: జమ్మూకాశ్మీర్‌లో ఎన్ఐఏ సోదాలు.. 45 ప్రాంతాల్లో కొనసాగుతున్న తనిఖీలు..

AP Crime: ఆ అనుమానంతో.. భార్యపై కత్తితో దాడి.. అనంతపురం జిల్లాలో దారుణం..