AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Court Judgement: కన్న కూతురుపైనే తండ్రి అత్యాచారం.. కామాంధుడికి జీవిత ఖైదు విధించిన ప్రత్యేక న్యాయస్థానం

Court Judgement: మానవత్వం మంటగలిసిపోతోంది. రోజురోజుకు దేశంలో అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. సొంత కూతురు, మనవరాళ్లపైనే..

Court Judgement: కన్న కూతురుపైనే తండ్రి అత్యాచారం.. కామాంధుడికి జీవిత ఖైదు విధించిన ప్రత్యేక న్యాయస్థానం
Madras High Court
Subhash Goud
|

Updated on: Mar 27, 2021 | 5:21 PM

Share

Court Judgement: మానవత్వం మంటగలిసిపోతోంది. రోజురోజుకు దేశంలో అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. సొంత కూతురు, మనవరాళ్లపైనే తండ్రి అత్యాచారానికి పాల్పడుతుండటం సమాజం తలదించుకునేలా ఉంది. కన్న కూతుళ్లపైనే అత్యాచారాలకు, హత్యలకు పాల్పడుతున్న తండ్రులను చూస్తుంటే సమాజం ఎటువైపు వెళ్తోందో అర్థమైపోతోంది. మహిళలపై ఇలాంటి దారుణాలను అరికట్టేందుకు న్యాయస్థానాలు, పోలీసులు ఎన్ని కఠినమైన చర్యలు చేపడుతున్నా.. ఇలాంటి దారుణాలు ఆగడం లేదు. తాజాగా ఓ తండ్రి కన్న కూతురు, మనవరాలిపైనే అత్యాచారానికి పాల్పడటంతో ముంబై ప్రత్యేక న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు శిక్ష విధించింది. కూతురు వాగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు.. విచారణ ముమ్మరం చేసి ఎట్టకేలకు ఆ కామంధుడికి శిక్ష పడేలా చేశారు. ఇలాంటి తండ్రికి శిక్ష పడటం పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై శిక్షణ కఠినంగా ఉంటే పునరావృతం కావదని చెబుతున్నారు.

వివరాల్లోకి వెళితే..2017లో ముంబైలో ఓ తండ్రి కుమార్తె, మనవరాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కూతురు 15 ఏళ్లుగా  తనపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తండ్రి చేసిన అఘాయిత్యాల గురించి వాగ్మూలాన్ని ఇచ్చింది. అంతేకాదు అత్యాచారం జరిపిన తండ్రి ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు కుమార్తె కోర్టు ముందు తన గోడు వెళ్లబోసుకుంది. ఈ లైంగిక వైధింపులపై కూడా ఇరుగుపొరుగువారికి కూడా తెలియజేసినట్లు ఆమె కోర్టులో తెలిపింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి పూర్తి వివరాలు కోర్టుకు అందజేశారు. దీంతో విచారణ జరిపిన ముంబై ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. కుమార్తెపై, మనవరాలిపై అత్యాచారానికి పాల్పడిన 68 ఏళ్ల వ్యక్తికి ముంబై ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.అయితే జస్టిస్‌ రేఖ ఎన్‌ పంథారే అన్ని సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత ఐపీసీ సెక్షన్‌ 376 (2) మరియు పోక్సో చట్టం కింద తండ్రికి జీవిత ఖైదు శిక్ష విధించింది. అలాగే కుమార్తెకు రూ.50 వేలు, మనవరాలికి రూ.25వేల పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.

ఇవీ చదవండి: Govinda Raja Swamy Temple Theft : గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నం, సీసీ టీవీ కెమారాల్లో దొంగ కదలికలు

Tamilnadu Crime : తమిళనాడులో దారుణ ఘటన.. తల్లీ, బిడ్డలను ముక్కలుగా నరికిన ప్రియుడు.. కారణాలు తెలిస్తే షాక్..