AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: త్రిపురలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు బీజేపీ నాయకులు మృతి.. మరికొంత మందికి..

4 BJP Workers Killed : త్రిపురలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు బీజేపీ నాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో

Road Accident: త్రిపురలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు బీజేపీ నాయకులు మృతి.. మరికొంత మందికి..
Road Accident
Shaik Madar Saheb
|

Updated on: Mar 27, 2021 | 4:30 PM

Share

4 BJP Workers Killed : త్రిపురలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు బీజేపీ నాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం దక్షిణ త్రిపురలోని గోమతి జిల్లాలో చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళా నేతలు ఉన్నారు. ఎన్నికల సన్నాహక ర్యాలీకి హాజరై తిరిగి వస్తుండగా శుక్రవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది.

భారతీయ జనతా పార్టీ నేతలు, మరికొంత మంది కార్యకర్తలు శుక్రవారం జరిగిన సీఎం ర్యాలీ పాల్గొని మ్యాక్సీ ట్రక్కులో ఇళ్లకు తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో గోమతి జిల్లా అమర్‌పూర్ నాతూన్ బజార్ చెల్లిగంజ్ వద్ద ట్రక్కు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్థానిక నేతలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మృతులను ఊర్వశి కన్య జమాటియా (45), మమతా రాణి జమాటియా (26), రచనా దేవి జమాటియా (30), గహిన్ కుమార్ జమాటియా (65)గా గుర్తించారు.

అయితే.. ఏప్రిల్ 6న త్రిపుర గిరిజన ప్రాంతాల్లో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి సీఎం బహిరంగ సభకు హాజరైన వీరంతా.. మరికాసేపట్లో తమ స్వస్థలం నాతున్ బజార్‌కు చేరుకుంటారనగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మానిక్ సాహ ఆందోళన వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని వారు పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Also Read:

తేయాకు ఆకులు పెరగకుండానే ఎలా కోస్తారు.. అంతా ఉత్తుత్తి… ఫోటో సెషన్ కోసమే.. ప్రియాంకపై షా సెటైర్లు

Court Judgement: కన్న కూతురుపైనే తండ్రి అత్యాచారం.. కామంధుడికి జీవిత ఖైదు విధించిన ప్రత్యేక న్యాయస్థానం

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!