Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govinda Raja Swamy Temple Theft : గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నం, సీసీ టీవీ కెమెరాల్లో దొంగ కదలికలు

Govindaraja swami temple Theft : ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలోని చారిత్రక శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో దొంగ చోరీకి విఫలయత్నం చేశాడు...

Govinda Raja Swamy Temple Theft : గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నం, సీసీ టీవీ కెమెరాల్లో దొంగ కదలికలు
Tirupati Govinda Raja Swami
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 27, 2021 | 5:10 PM

Tirupati Govinda Raja Swamy Temple Theft : ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలోని చారిత్రక శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో దొంగ చోరీకి విఫలయత్నం చేశాడు. రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారి ఏకాంత సేవ తర్వాత ఆలయంలోనే ఉండిపోయాడు దొంగ. అనంతరం ఆలయంలోని అన్నీ హుండీలు తెరిచేందుకు ప్రయత్నించాడు. అయితే, ఏ హుండీ తాళాలు తెరుచుకోలేదు. దీంతో సదరు దొంగ ప్రయత్నాలు ఫలించలేదు.

అయితే, దొంగ కదలికలన్నీ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైపోయాయి. రాత్రంతా దొంగ ఆలయంలోనే ఉన్నట్లుగా సీసీఫేటేజ్‌లో తెలుస్తోంది. అయితే, రాత్రంతా దొంగ ఆలయంలోనే ఉన్నా భద్రతా సిబ్బంది ఏమాత్రం గుర్తించలేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గతంలోనూ ఇదే దొంగ గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటం కాజేసినట్లు తెలుస్తోంది.

కాగా, ఉదయం సుప్రభాతం సేవ కోసం తాళాలు తెరిచిన అధికారులు, అర్చకులు.. ఆలయంలోని హుండీతో పాటు వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో చోరీ జరిగిందని అనుమానించారు. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించడంతో దొంగ విషయం అప్పుడు బయటకొచ్చింది. దీంతో ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు గోవింద రాజ స్వామి ఆలయం వద్దకు చేరుకున్న తిరుపతి అర్బన్ క్రైం పోలీసులు..  సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించే పనిలో ఉన్నారు. ఏకంగా,  ఎంతో పటిష్టమైన, దుర్భేధ్యమైన  గోవిందరాజు స్వామి ఆలయంలో చోరీ వ్యవహారం స్థానికంగా సంచలనం రేపింది.

Read also : Car Fire : వెళ్తోన్న కారు వెనుక మంటలు, అలర్ట్ చేసిన వాహనదారులు, దంపతులకు తప్పినముప్పు, పత్తాలేని ఫైర్ సిబ్బంది.!