Tamilnadu Crime : తమిళనాడులో దారుణ ఘటన.. తల్లీ, బిడ్డలను ముక్కలుగా నరికిన ప్రియుడు.. కారణాలు తెలిస్తే షాక్..
Tamilnadu Crime : వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయినా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.
Tamilnadu Crime : వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయినా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. తల్లిదండ్రులు చేసిన తప్పులకు పిల్లలు బాధపడుతున్నారు. ఒంటరిగా, అనాథలుగా మారి సమాజంలో అభాగ్యులుగా మిగిలిపోతున్నారు. తమిళనాడులో వివాహేతర సంబంధం వల్ల ఓ తల్లీ కొడుకులు దారుణంగా హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తేని జిల్లా ఉత్తమపాళయం సమీపంలోని పుదుపట్టికి చెందిన కరుప్పుస్వామి కుమార్తె కలైసెల్వి (22). ఈమెకు మధురై జిల్లా పేరావూరుకు చెందిన కాశి రాజన్‌తో పెళ్లి జరిగింది. వీరికి ఒక బాబు కూడా జన్మించాడు. అయితే 2020వ సంవత్సరంలో కలైసెల్వి ఆమె కుమారుడు బయటికి వెళ్లి మళ్లీ కనిపించలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా.. స్నేహితుల వద్ద ఆరా తీసిన వివరాలు దొరకలేదు. దీంతో యువతి తండ్రి కరప్పుస్వామి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
అయితే 2021 మార్చి 26న చిన్నమనూరు అయ్యనార్ ఆలయ కోనేరులో మూడు గోనె సంచులు కనిపించడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దుస్తుల ఆధారంగా అవి కలైసెల్వి, ఆమె బిడ్డకు చెందినవిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో షాకింగ్ నిజాలు తెలిసాయి. కలైసెల్వికి పెళ్లికి ముందే చిన్నమనూరుకు చెందిన వివాహితుడితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. పెళ్లి జరిగిన తర్వాత కూడా వీరి బంధం కొనసాగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించగా తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కలైసెల్వితో పాటు ఆమె కుమారుడిని చంపి ముక్కలు ముక్కలుగా చేసి గోనె సంచిలో కట్టి కోనేరులో పడేసానని తెలిపాడు.