Hyderabad: 16 ఏళ్లుగా పోలీసులకు చుక్కలు.. 70వేల ఫోన్ నంబర్స్ సెర్చ్.. ఫైనల్‌గా చిక్కాడు
ఎట్టకేలకు మోస్ట్ వాంటెడ్ దొంగ రాసికుల్‌ఖాన్‌ను అరెస్ట్ చేశారు రాచకొండ సీసీఎస్ పోలీసులు. 5 రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ గజదొంగను.. ఫైనల్‌గా ఖాకీల చేతికి చిక్కాడు.
notorious thief : కరుడుగట్టిన గజదొంగను అరెస్ట్ చేశారు హైదరాబాద్ రాచకొండ సీసీఎస్ పోలీసులు(Rachakonda Ccs Police ). అతడు మాములోడు కాదు. ఒకటి కాదు..రెండు కాదు..16 ఏళ్లుగా పోలీసులకు చుక్కలు చూపించాడు. ఎట్టకేలకు మోస్ట్ వాంటెడ్ దొంగ రాసికుల్‌ఖాన్‌ను అరెస్ట్ చేశారు రాచకొండ సీసీఎస్ పోలీసులు. 5 రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ గజదొంగను.. ఫైనల్‌గా ఖాకీల చేతికి చిక్కాడు. 2006 నుండి పోలీసులకు దొరక్కుండా దొంగతనాలకు పాల్పడుతున్నాడు ఈ రాసికుల్ ఖాన్. తాళం ఉన్న ఇండ్లను రెక్కీ చేసి బంగారం, నగదు చోరీ చేసేవాడు. ఇలా రాచకొండ పరిధిలో 17 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, గోవా రాష్ట్రాల్లోనూ చోరీలకు పాల్పడుతున్న ఈ కేటుగాడిపై.. వందల్లో కేసులు నమోదయ్యాయి. పలు కేసుల్లో ఇప్పటివరకు మూడున్నర కిలోల బంగారం చోరీ చేశాడు. ఇతన్ని పట్టుకునేందుకు 70వేల ఫోన్ నంబర్స్ సెర్చ్ చేశారు పోలీసులు. ఈ మోస్ట్ వాంటెడ్ దొంగ నుంచి 52 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
Also Read: పసికందును చంపి ఉరేసుకున్న తల్లి..! పోలీసులు సైతం కన్నీరు.. కానీ చివరి నిమిషంలో
డాక్టర్‌కి కాల్‌చేసి జాబ్ అడిగిన ఐఏఎస్..! ఆరా తీస్తే అసలు బాగోతం తెలిసింది