Cyber Crime: గూగుల్ పే చేస్తామని.. లింక్ పంపించి.. అందిన కాడిని దోచుకున్నారు
సైబర్ (cyber) నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజురోజుకు తమ పంథా మార్చుకుని సరికొత్తగా నేరాలకు పాల్పడుతున్నారు. సాంకేతికను అందిపుచ్చుకుని అమాయకులను...
సైబర్ (cyber) నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజురోజుకు తమ పంథా మార్చుకుని సరికొత్తగా నేరాలకు పాల్పడుతున్నారు. సాంకేతికను అందిపుచ్చుకుని అమాయకులను ఆసరాగా చేసుకుని, అందినకాడికి దోచుకుంటున్నారు. బాధితులు మోసపోయానని గ్రహించే లోపే మాయమవుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఇల్లు అద్దెకు తీసుకుంటామని నమ్మించి, బాధితుడి ఫోన్ కు ఓ లింక్ పంపించారు. అది ఓపెన్ చేయగానే అతని ఖాతా నుంచి రూ. 1.7 లక్షలు నగదు మాయమైంది. బాధితుడు తేరుకునే లోపే నేరగాళ్లు పలాయనం చిత్తగించారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్త చేపట్టారు.
నగరంలోని మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన ఆన్సర్ అహ్మద్.. ఇల్లు అద్దెకు ఇస్తామని ఓ యాప్ లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ని చూసిన సైబర్ నేరగాడు ఇల్లు అద్దెకు తీసుకుంటామని చెప్పాడు. తను గూగుల్ పే చేస్తానని చెప్పాడు. అతని మాటలు నిజమేనని నమ్మిన అహ్మద్.. గూగుల్ పే నెంబరు పంపించాడు. అనంతరం డబ్బు పంపించానని చెప్పి మోసానికి పాల్పడ్డాడు సైబర్ నేరస్ధుడు. తనకు అమౌంట్ రాలేదని అహ్మద్ చెప్పడంతో.. తన వాట్సాప్ నంబర్ కు సైబర్ నేరగాళ్లు ఒక లింకు పంపించారు. ఆ లింక్ ఓపెన్ చేయగానే.. అహ్మద్ ఖాతాలో నుంచి రూ.లక్షా 70 వేలు మాయమయ్యాయి. గమనించిన బాధితుడు అహ్మద్.. ఈ ఘటనపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
Visakhapatnam: అయ్యో తల్లి ఎంత పని చేశావమ్మా.. పాపం అన్నెం పున్నెం తెలియని చిన్నారులు..!
Andhra Pradesh: కిలాడీ పేకాట రాయుళ్లు.. రైడ్ చేసేందుకు వెళ్లిన ఎస్‌ఐని దొంగ అంటూ చితకబాదారు