AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: అయ్యో తల్లి ఎంత పని చేశావమ్మా.. పాపం అన్నెం పున్నెం తెలియని చిన్నారులు..!

Visakhapatnam: విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులతో సహా బావిలో దూకింది తల్లి. చిన్నారులు ఇద్దరు మృతిచెందగా..

Visakhapatnam: అయ్యో తల్లి ఎంత పని చేశావమ్మా.. పాపం అన్నెం పున్నెం తెలియని చిన్నారులు..!
Shiva Prajapati
|

Updated on: Feb 14, 2022 | 5:42 PM

Share

Visakhapatnam: విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులతో సహా బావిలో దూకింది తల్లి. చిన్నారులు ఇద్దరు మృతిచెందగా.. తల్లిని కాపాడారు స్థానికులు. రోలుగుంట మండలం జె నాయుడు పాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్య భర్తల మధ్య కలహాలు కారణమని ప్రాథమికంగా తేల్చారు పోలీసులు. అన్నెం, పున్నెం తెలియని ముక్కుపచ్చలారని చిన్నారుల మరణానికి కారణమైన ఈ ఘటనతో ఆ ప్రాంతం విషాదంలోకి వెళ్ళింది.

వివరాల్లోకెళితే.. రోలుగుంట మండలం, జె.నాయుడుపాలెం గ్రామానికి చెందిన గడదాసు నాగరాజుకు, అదే మండలం, వడ్డిప గ్రామానికి చెందిన సాయితో ఆరేళ్ల క్రితం వివాహమయ్యింది. నాగరాజు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి నాలుగేళ్ల భాను, రెండేళ్ల ప్రుద్వీ రాజ్ ఉన్నారు. ఆటో డ్రైవర్ కావడంతో అంతంతమాత్రంగా వచ్చే ఆదాయంతో నిత్యం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో భార్యా, భర్తల మధ్య తరచూ వాగ్వివాదం జరుగుతుండేది. ఇటీవల బంగారం కొనే క్రమంలో దంపతుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ వల్ల తన పిల్లలను తీసుకుని భార్య సాయి హడావిడిగా బయటకు వెళ్లిపోయింది. తిరిగి తానే వస్తుందని భావించిన నాగరాజు వారి గురించి పట్టించుకోలేదు. అయితే సాయి తన పిల్లలైన భాను, పృధ్విలను తీసుకుని సమీపంలో ఉండే భావి వద్దకు వెళ్లింది. ముందు పిల్లలను బావిలో పడేసి, తరువాత తనూ దూకేసింది. ఈ ఘటనలో చిన్నారులు ఇద్దరూ మృతి చెందగా.. బావిలోకి దూకిన తల్లి సాయి భయపడుతూ మెట్టు పట్టుకుని వేలాడుతూ ఉండిపోయింది. ఉదయం అటుగా వచ్చిన వారి శబ్ధం విని సాయి గట్టిగా కేకలు వేసింది. దాంతో వారంతా వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకుని అప్పటికే చనిపోయిన చిన్నారులతో పాటు తల్లిని బయటకు తీశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోస్టుమార్టం నిమిత్తం చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Robbery: పార్క్ చేస్తే వారికి పండగే.. కళ్లు మూసి తెరిచేలోపు అంతా మాయం.. సినిమాను మించిన దోపిడీ, ఛేజింగ్..

Mamata Phone Call to KCR: సీఎం కేసీఆర్‌కు ఫోన్ కాల్ చేసిన మమతా బెనర్జీ.. భారీ ర్యాలీకి ప్లాన్..!

Anurag Thakur vs KCR: పాకిస్తాన్ మాటల్లా ఉన్నాయి.. కేసీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి..